అల్లూరి జిల్లా మండల స్థాయి వైసీపీ క్యాడర్ జనసేన వైపు చూపు

స్టాఫ్ రిపోర్టర్ మాదిరి చంటిబాబు,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జులై 4 అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వైసిపి మండల స్థాయి కేడర్ అదును చూసి జనసేన పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి.

 పాడేరు, అరకు పార్లమెంటు పరిధిలో వైసిపి ఎమ్మెల్యే ఎంపీలు అధికారంలో ఉన్న తమకు అధికార తెలుగుదేశం పార్టీ నుండి వేధింపులు తప్పవని పలువురు వైసిపి నాయకులు జనసేన పార్టీ వైపు వెళ్లడానికి ముగ్గు చూపుతున్నారు.ఈ మేరకు జనసేన కీలక నాయకులతో చర్చలు కొనసాగిస్తున్నారు. అల్లూరి జిల్లాలో అరకు పార్లమెంట్,అరకు అసెంబ్లీ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకున్నప్పటికీ ఆ పార్టీ అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు కె.భాగ్యలక్ష్మి ఇంతవరకు మండల స్థాయిలోని పార్టీ నాయకులను కలుపుకొని వెళ్లే కార్యక్రమాన్ని నిర్వహించకపోవడంతో పాటు ఇటీవల జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రస్తుతం స్థానిక సంస్థలలో అధికారంలో ఉన్న వైసిపి సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని ముందుకు రాకుండా కూటమి సభ్యులే పంపిణీ చేయడంతో వైసిపి అల్లూరి జిల్లా క్యాడర్లో తీవ్ర నిరాశ నిస్సృహాలు నెలకొన్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముంగిటకు వెళ్లాలంటే తాము ఏదైనా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేకపోవడం వల్ల అల్లూరి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులే అత్యధికంగా సర్పంచులుగా ఎంపిటిసిలుగా జడ్పిటిసిలుగా ఉన్నారు,అయితే మీరు ఇప్పుడు ఉత్తి ఉత్సావ విగ్రహాలుగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.గత వైసిపి ప్రభుత్వం హయాంలో కూడా ఎటువంటి అధికారాలు లేకుండా సర్పంచులు ఎంపీటీసీలు,జడ్పిటిసిలు ఉత్సవ విగ్రహాలు గానె ఉన్నారు.అప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు అదే పరిస్థితి అయితే ఎలా సంశయంలో ప్రస్తుతం అల్లూరు జిల్లాలోని వైసిపి నాయకులకు క్యాడర్ కి కలిగింది.దీంతో పలువురు వైసిపి నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తృతంగా ప్రజల ముందుకు వస్తున్నారు.జనసేన పార్టీలో చేరాలని వివిధ ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించుకుని తీర్మానించుకున్నారు.ఇందులో భాగంగానే అల్లూరి జిల్లాలోని జనసేన పార్టీ కీలక నాయకుడు తో మంతనాలు చేస్తూ మరికొద్ది రోజుల్లో అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు మండలాల వైసిపి నాయకులు సర్పంచులు,ఎంపీటీసీలు కేడర్ అంతా కలిసి జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనికి పార్టీ కోసం ఎంతో అంకితభావంతో పనిచేసిన జనసేన పార్టీ క్యాడర్ ఎంతవరకు అంగీకారం తెలుపుతుందో చూడాలి. ఇప్పటికే పలువురు వైసిపి నాయకులపై, సర్పంచులు ఎంపిటిసి లపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత, అసహనం ఉన్నాయి. అటువంటి వ్యక్తులు జనసేన పార్టీలోకి వస్తే పార్టీ మనుగడపు ముప్పు వాటిలే ప్రమాదం ఉందని పేరు చెప్పటానికి ఇష్టపడని జనసేన పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.