*చెవిటివారి ముందు శంఖం ఊదిన చందంగం రెవెన్యూ యంత్రాంగం వైఖరి..*
*ఎన్నికల సాకుతో..! అధికారులు చర్యలకు దూరం..! ప్రభుత్వ భూములు అప్పనంగా కబ్జాకు..*
*బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు..! ఊరట కోసమేనా..?*
*అక్రమ షెడ్లు కూల్చివేస్తామని, పోలీస్ ప్రొటెక్షన్ పేరుతో వారం రోజులుగా బుకాయిస్తున్న రెవెన్యూ..!*
*షెడ్డు చుట్టే అధికారుల ప్రదక్షిణలు..! చర్యల కోసమా..? అక్రమార్కలతో సంధి కోసమా..?*
*కమ్మ సంఘం భవన్ పక్కన తొలగించిన ఫెన్సింగ్‌కు, మళ్ళీ ఐరన్ పోల్స్ ..*
అక్రమార్కులు సవాల్ విసురుతూ..! ఆక్రమణలకు పాల్పడుతుంటే..! అధికారులు చోద్యం..!
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఏప్రిల్:28
ప్రభుత్వ భూమి కబ్జాకు అధికారులే పరోక్షంగా సహకరిస్తున్నారని స్పష్టమవుతుంది..! బహుదూర్‌పల్లి సర్వే నెం. 227 ప్రభుత్వ భూమిలో..! ఓవైపు నిరంతరంగా అక్రమ రిజిస్ట్రేషన్‌లు.. మరోవైపు అక్రమ షెడ్లు నిర్మస్తుంటే..! షెడ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారు.. పనులు జరగడం లేదని బుకాయిస్తూనే, అక్రమ షెడ్ల నిర్మాణం పూర్తి చేసినా రొటీన్ డైలాగులతో చర్యలకు దూరంగా ఉంటున్నారు.. మరోవైపు ఎన్నికల విధుల పేరిట ఖరీదైన ప్రభుత్వ స్థలాల్లో షెడ్లు నిర్మించుకునే సౌకర్యం కల్పిస్తున్నారు.. 227లో ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఏర్పాటు కూడా..! ప్రశ్నిచిన వారికి చూపించేందుకే తప్ప..! కబ్జాల నితంత్రణకు కాదని తెలుస్తోంది..
క్లుప్తంగా రేపటి సంచికలో..