227 ప్రభుత్వ భూమిలో..! నిరంతర రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ..!

227-procedure-for-continuous-registrations-in-government-land

227 ప్రభుత్వ భూమిలో..! నిరంతర రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ..!

  • ప్రభుత్వ స్థలంలో సీసీరోడ్లకు సహకరించిన అధికారులకి..! రిజిస్ట్రేషన్‌లు ఓ లెక్కనా..?
  • సాయినాథ్ సొసైటీ ప్లాట్‌లను అధ్యక్షుడి హోదాలో బొడ్డు రవిశంకర్ రిజిస్ట్రేషన్‌లపై చర్యలేవి..?
  • ప్రభుత్వ భూమిలో ప్లాట్‌లు విక్రయంపై.. క్రిమినల్ చర్యలు ఏవి..?
  • నోటీసులు ఇచ్చిన సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డుపై తహశీల్దార్ సారుకు అంత ప్రేమెందుకు..?
  • గత నవంబర్ 25న ఫోటోషూట్ చర్యలతో.. షెడ్డుకు చర్యల మినహాయింపు దేనికి..?
  • దుండిగల్‌ మండలం బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో నాన్‌స్టాప్ రిజిస్ట్రేషన్‌లు..
  • మేడ్చల్ జిల్లా రిజిస్టార్‌కి(డిఆర్) జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 2024 జూన్ 28న లేఖ..
  • అయినప్పటికీ గత నవంబర్ 21 వరకు యధావిధిగా రిజిస్ట్రేషన్‌లు..
  • జిల్లా రిజిస్టార్ (డిఆర్‌)కి రెవెన్యూ యంత్రాంగం లేఖలకు విలువ లేదా..? ఉత్తుత్తివేనా..?
  • 2009 సెప్టెంబర్ 9న హైకోర్టు డైరెక్షన్‌తో జగన్మోహన్ ఐఏఎస్ 227 ప్రభుత్వ భూమిగా ప్రొసీడింగ్..
  • ప్రభుత్వ నిధులతో..అదే ప్రభుత్వ భూమిలో రూ.60 లక్షలు దుర్వినియోగంతో సీసీరోడ్లు..?
  • 227 హైకోర్టు పరిధిలో ఉన్నపుడే.. సీసీరోడ్లను నిలిపి వేయకుండా సహకరించిన అధికారులు..?
  • 2004 నాటి హైకోర్టు ఉత్తర్వులను మరోసారి పునర్ పరిశీలనకై కలెక్టర్‌కి హైకోర్టు తాజా ఉత్తర్వులు..
  • పునర్ పరిశీలనలో భాగంగా 227 ప్రభుత్వ భూమి సాయినాథ్ సొసైటీకి అప్పగించే అవకాశం ఉందా..?
  • 227లో "2022-2023" వరకు ముందస్తుగా 200 ఎకరాలకు పైగా ధరణీ రిజిస్ట్రేషన్‌లు..!
  • 2024 జనవరి 8 నుండి మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నిరంతర రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ..
  • 2024 ఆగష్టు నెలలో రూ.60 లక్షలు ఎస్‌డిఎఫ్ నిధులతో సీసీరోడ్డు.. కలెక్టర్‌కి తెలిసినా సైలెంట్..?
  • 227 కబ్జాదారులకి రిజిస్ట్రేషన్‌లు, సీసీరోడ్లు దేనికి సంకేతం..? కట్టబెట్టేందుకు సర్వం సిద్దమా..?

4

 

బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమి 353.35 ఎకరాలు పోరంబోకు భూమిగా పేర్కొంటూ..! సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డుకి "2024 మే 7న" నోటీసులు జారీ చేసిన తహశీల్దార్..! గత జూన్ 28న కలెక్టర్ ఆదేశాలతో రిజిస్ట్రేషన్‌లు నిలిపివేతకు మేడ్చల్ జిల్లా రిజిస్టార్‌కి లేఖను రాసిన తహశీల్దార్..! నిరంతర రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియపై దృష్టి సారించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. సర్వే నెం.227 పోరంబోకు భూమిలో జరుగుతున్న పరిణామాలు (యధేచ్చగా రిజిస్ట్రేషన్‌లు, ప్రభుత్వ నిధులతో సీసీరోడ్ల నిర్మాణం ) దేనికి సంకేతం..? హైకోర్టు ఖర్చుల పేరిట 2024 జనవరి 8న ప్రభుత్వ భూమిలోని 5 సొసైటీ ప్లాట్‌లను బొడ్డు రవిశంకర్ రిజిస్ట్రేషన్‌‌ చేయడంపై..! రెవెన్యూ యంత్రాంగం క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదు..? ప్రస్తుతం సాయినాథ్ సొసైటీకి అనుకూలంగా తీర్పు రావడం కోసం అంటూ కలెక్టరేట్‌ ఖర్చుల పేరుతో, మరో రెండు ప్లాట్‌లను రిజిస్ట్రేషన్‌ చేసినట్లు సమాచారం.. ప్రభుత్వంపై గెలవడానికి, ప్రభుత్వ ఆస్తులు విక్రయిస్తుంటే సంబంధిత అధికారులు ఏంచేస్తున్నారు..? అక్రమార్కులతో చేతులు కలిపి రిజిస్ట్రేషన్‌లకి సహకరిస్తున్నారా..? "తిలాపాపం తలాపిడికెడు" ఈసామెత సరిగ్గా సూటు అవుతుందేమో..!

మాధవ్ పత్తి.. మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, జనవరి 16:

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ గండిమైసమ్మ మండలం, బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమి 353.35 ఎకరాలు పోరంబోకు భూమిగా, నిర్ధారణతో నోటీసులు జారీచేసిన రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుందా..?సుమారు రూ.2 వేలకోట్లు పైచిలుకు విలువైన ప్రభుత్వ ఆస్తులపై ఎందుకింత అలసత్వం..? 227 ప్రభుత్వ భూమిగా పేర్కొంటూనే..! ధరణీ రిజిస్ట్రేషన్‌లు ఎలా చేశారు..? ప్రభుత్వ స్థలంలోని సాయినాథ్ సొసైటీలో మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏడాది పాటు చేసిన రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను నియంత్రించడంలో మేడ్చల్ జిల్లా అధికారులు విఫలం అయ్యారు.. మరోవైపు సాయినాథ్ సొసైటీ అధ్యక్షుడి హోదాలో బొడ్డు రవిశంకర్ 2024 జనవరి 8న ప్రభుత్వ భూమి, సొసైటీ ఆధీనంలో ఉన్న 5 ప్లాట్‌లు రిజిస్ట్రేషన్‌ చేశాడని "పెన్ పవర్" దినపత్రికలో పలుమార్లు వార్తలు వచ్చినా..! క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదు..? తప్పు‌ జరగ లేదా..? పెన్ పవర్ దినపత్రిక తప్పుగా రాసిందా..? సొసైటీ ఆధీనంలో ఉన్న మరో 2 ప్లాట్‌లు ఈమధ్యనే రిజిస్ట్రేషన్‌లు చేసినట్లు, సభ్యుల నుండి విశ్వసనీయ సమాచారం.. ఇంత జరిగినా కలెక్టర్ కనీసం విచారణ జరిపించారా..? ఓ జిల్లా అధికారికి సాయినాథ్ సొసైటీ అధ్యక్షుడు అంత స్పెషల్ ఏంటి..? ఒకే సామాజిక వర్గం కావడమే ప్రధాన కారణమా..?

3

తహశీల్దార్ నోటీసులు ఇచ్చిన షెడ్డుపై.. చర్యలు లేనట్టేనా..?

గత నవంబర్ 25న బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, కంటైనర్‌ల తొలగింపు ప్రక్రియలో సవ్వంగానే ఉన్నప్పటికీ.. దుండిగల్‌ తహశీల్దార్ 2024 మే 7న నోటీసులు ఇచ్చిన అక్రమ షెడ్డుపై ఉదాసీనతతో వ్యవహరించడం పలు ఆరోపణలకు తావిస్తోంది.. అదేంటో కానీ, కంటైనర్‌‌లు తొలగించారు.. ఓ అక్రమ నిర్మాణాన్ని కూడా పూర్తిగా కూల్చివేశారు.. కానీ ఎమ్మార్వో నోటీసులు ఇచ్చిన సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డు మాత్రం ఫోటోషూట్ చర్యలతో వెనుదిరిగారు.. ఓ మూలన కొద్దిగా డ్యామేజ్ చేసి సహకరించడం దేనికి సంకేతం..? అక్రమం అని తెలిసినా కబ్జాదారులకు రూ.60 లక్షల ఎస్‌డిఎఫ్ నిధులతో సీసీరోడ్డు వేశారు.. ప్రభుత్వ భూమిలో అక్రమ సీసీరోడ్డు నిర్మాణం ఏ అధికారి సహకారంతో చేపట్టారో, ఈ విషయంలో జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తే బాగుండేది..!

1

ఏదిఏమైనప్పటికీ రూ.2 వేలకోట్లు విలువైన సర్కారు జమీన్‌లో..! అధికారులు ఏ ఉద్దేశంతో ధరణీ రిజిస్ట్రేషన్‌లు, సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌లు చేశారో..? ప్రభుత్వ స్థలంలపొ సీసీరోడ్డు నిర్మాణానికి కలెక్టర్‌ని తప్పు దోవపట్టించి, రూ.60 లక్షలు ఎస్‌డిఎఫ్ నిధులు కేటాయించారో కానీ..!! కబ్జాదారుల సంకల్పం మాత్రం ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోవడానికి ఎంతకైనా బరితెగిస్తున్నారని స్పష్టమవుతుంది.. ఈ వ్యవహారంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల సాయంతో ధరణీ రిజిస్ట్రేషన్‌లు..! ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడాది పాటు సాయినాథ్ సొసైటీ రిజిస్ట్రేషన్‌లు నిరంతర ప్రక్రియగా కొనసాగినా అధికారుల చర్యలు మొక్కుబడిగా ఉండటం పలు‌ అనుమానాలకి తావిస్తోంది.. తస్మాత్ జాగ్రత్త..

 

2

About The Author