చెరువులు, గొలుసుకట్టు కాలువలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలో సంబంధిత అధికారులే సూత్రదారులుగా వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతుంది.. స్థానిక కౌన్సిలర్ ఫిర్యాదును కూడా పట్టించుకోకుండా..! ఓ ప్రజాప్రతినిధి సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తూ, వక్రమార్గంలో చెరువులోనే మున్సిపల్ అనుమతులు మంజూరు చేశారు.. సదరు అక్రమ కట్టడంపై స్థానిక బీజేపీ నేత శ్రీనివాస్ యాదవ్ ఫిర్యాదు చేయగా..! చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌తో పాటు నాలాను కబ్జాచేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని రెవెన్యూ, ఇరిగేషన్ సర్వేలో తేలిందని..! వెంటనే నిర్మాణ అనుమతులు రద్దు చేయాల్సిందిగా..! 2023 మే 26న (Lr.No.B/30/2023) అప్పటి తహశీల్దార్ పద్మప్రియ దుండిగల్ మున్సిపల్ కమిషనర్‌కి లేఖ రాశారు.. ఓవైపు ప్రజాప్రతినిధి సిఫార్సులు, మరోవైపు చెరువు కబ్జా..! ఏం చేయాలో తెలియక, ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు 2023 నవంబర్ 3న "జీ+2" అంతస్తుల దశలో మున్సిపల్ అనుమతులు రద్దు చేశారు.. అయినప్పటికీ "జీ+4" ఎలా నిర్మించారో సంబంధిత ఉన్నతాధికారులే తేల్చాలి..! 2023 డిసెంబర్ 12,13 తేదీల్లో చర్యలకు వెళ్ళిన అధికారులు వెనుదిరిగి రావడానికి కారణం..? బిల్డర్ కోర్టు ఆర్డర్ తెచ్చుకునేందుకు అవకాశం కల్పించారా..? 20 రోజులు సమయంలో 2024 జనవరి 2న అల్లు రామనర్సయ్య హైకోర్టు నుండి స్టేటస్‌కో తెచ్చుకుని.. అదే హైకోర్టును ధిక్కరించి, ఫిబ్రవరి నెలలో యధావిధిగా నిర్మాణ పనులు చేపట్టారు..! పెన్ పవర్ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురించినా "దున్నపోతు మీద వర్షం పడిన" చందంగా సంబంధిత అధికారులు వ్యవహరించడం..! నేటికీ చర్యలు లేకపోగా..! హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలకు..! రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులే సూత్రధారిగా వ్యవహరిస్తున్నారని సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి..!
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, జూలై 18:
దుండిగల్ గండిమైసమ్మ మండలంలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధిత రెవెన్యూ అధికారులే కారణమవుతున్నారు.. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సహకారంతో,చెరువు నాలాతో పాటు, చెరువు ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్‌లో యధేచ్చగా అక్రమ నిర్మాణం చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు సర్వేలో తేల్చిందే..! అయినప్పటికీ సదరు అక్రమ నిర్మాణ దారులకు..! ఒక్కో తహశీల్దార్ ఏమేరకు సహకరిస్తున్నారో జిల్లా కలెక్టర్ గమనించాలి.. వివరాల్లోకి వెళ్ళితే.. మేడ్చల్ జిల్లా
దొమ్మర పోచంపల్లి గ్రామ పరిధిలోని కుడికుంట లేక్ఐడి నెం.2834 చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్‌లో బిల్డర్ "అల్లు రామనర్సయ్య " 800 గజాలకు..! వక్రమార్గంలో సిఫార్సులతో అనుమతులు తీసుకుని అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టారు.. బిల్డర్‌లు ఇలాంటి వ్యవహారాల్లో సంబంధిత అధికారులను ముందస్తుగా ప్రసన్నం చేసుకోవడం..! అంతా సక్రమంగా జరిగితే..! చెరువులో అక్రమ నిర్మాణాలు పూర్తిచేసి..! అమాయకులకు కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.. ఉదాహరణకు బౌరంపేట్ "త్రిపుర ల్యాండ్‌మార్క్"లో కట్టుకాలువపై 12 డూప్లెక్స్‌లు ఉన్నట్లు సర్వేలో తేల్చారు..! సైలెంట్‌గా వ్యవహరిస్తున్నారు..
కౌంటర్ దాఖలుకు రెవెన్యూ, ఇరిగేషన్ కాలయాపన.! ముడుపులే కారణమా..?
డి.పోచంపల్లి గ్రామ పరిధిలోని కుడికుంట లేక్ఐడి నెం.2834 చెరువు ఎఫ్‌టిఎల్ బఫర్ అండ్ నాలా ఆక్రమణతో..! సర్వే నెం.249 లో అల్లు రామనర్సయ్య అక్రమంగా అపార్ట్‌మెంట్ నిర్మాణంలో అధికారుల లాలూచికి నిదర్శనం.. డబ్బులు కురిపించే బిల్డర్‌లకు యంత్రాంగం ఎల్లప్పుడూ దాసోహం అంటూ మరోసారి నిరూపించారు సంబంధిత అధికారులు.. తప్పుడు నిర్మాణంగా గుర్తించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చర్యలకు వెనుకడుగు వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.. చెరువు కబ్జాపై ప్రశ్నిస్తే తహశీల్దార్, ఆర్ఐ పిట్ట కథలు వినిపిస్తున్నారు.. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్‌ను పార్టీ చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించిన బిల్డర్ అల్లు రామనర్సయ్య 2024 జనవరి 2న హైకోర్టు స్టేటస్‌కో ఇచ్చింది.. ఫిబ్రవరి లోనే మున్సిపల్ కమిషనర్ కౌంటర్ దాఖలు చేసినప్పటికీ.. *"రెవెన్యూ, నీటిపారుదల శాఖలు"* నేటికీ కౌంటర్ దాఖలు చేయలేదు.. పైగా స్టేటస్‌కోను ధిక్కరించి బిల్డర్ అల్లు రామనర్సయ్య యధేచ్చగా అక్రమ నిర్మాణంలో పనులు చేస్తున్నారని..! " పెన్ పవర్" దినపత్రికలో పలుమార్లు వార్తను ప్రచురించి రెవెన్యూ, ఇరిగేషన్ దృష్టికి తీసుకెళ్ళినా చర్యలు శూన్యం.. కౌంటర్ దాఖలుపై అధికారులు కామ్‌గా ఉండిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చెరువు కబ్జాకు సహకరిస్తున్నట్టా..? లేకపోతే హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరిస్తున్నట్టా..? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలపై.. "ఆపరేషన్-హైడ్రా" కమిషనర్‌గా
"రంగనాథ్ ఐపీఎస్" నియామకం సమంజసమే..! కానీ చెరువుల కబ్జాలకి కారణమైన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను గుర్తించి సస్పెండ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు..చెరువులు, భూ కబ్జాలను అరికట్టడంలో "హైడ్రా" సఫలమవుతుందా.. విఫలమవుతుందా.. వేచి చూడాలి.. మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ప్రభుత్వ భూములు కాపాడాలని ఓవైపు సమీక్షలు నిర్వహిస్తుంటే..! దుండిగల్ తహశీల్దార్ కౌంటర్ దాఖలు చేయకుండా.. సైలెంట్‌గా ఉండటం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు అప్రదిష్ట పాలవుతుంది..