20వతేదిలోగా మొక్కలు నాటాలి -10వ తేదీ నాటికి గోతులు పూర్తి చేయాలి

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జూలై04: ఎన్ఆర్ఇజిఎస్ కింద మొక్కలు నాటే కార్యక్రమం వేగవంతం చేయాలని,నాణ్యమైన మొక్కలు సేకరించి రైతులకు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు.గురువారం కలెక్టరేట నుండి జిల్లాలోని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారులు అన్ని మండలాల ఎంపిడిఓలు, ఎపిఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 లో లక్ష్య సాధన,2024-25 లో టార్గెట్లపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఈ నెల పదవ తేదీలోగా మొక్కల నాటడానికి అవసరమైన గోతులు తీయడం పూర్తి చేయాలని,20వ తేదీలోగా మొక్కలు నాటడం పూర్తీ చేయాలని సూచించారు. పనులు వేగవంతం కావాలని ఆదేశించారు.అదేవిధంగా మన నర్సరీలలో అందుబాటులో ఉన్న మొక్కలు,ఇతర ప్రాంతాల నుండి తేవలసిన మొక్కలు గూర్చి ఆరా తీసారు.ప్రభుత్వ నిభంధనల ప్రకారం మొక్క సైజు,నాణ్యత పరిశీలించాలని,అందుకు ఎంపిడిఓ ఆద్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు బృందంగా ఏర్పడి తనిఖీ చేయాలని ఆదేశించారు.ఇతర ప్రాంతాల నుండి తీసుకు వచ్చిన మొక్కలలో ఎంత వరకు బతికేది చూడాలని,నాణ్యతా లోపాలతో పంపించిన నర్సరీలను బ్లాక్ లిస్టు లో పెట్టాలని సూచించారు.ముఖ్యంగా జీడిమామిడి,సిల్వర్ ఓక్ మొక్కలకు డిమాండ్ ఉన్నందున వాటిని వాటితో పాటు ఇతర పండ్ల మొక్కలను రైతుల అభీష్టం మేరకు సేకరించాలని ఆదేశించారు. కాఫీ పంటకు సంబంధించి ఎన్ఆర్ఇజిఎస్ కింద చేపట్టడానికి అవకాశం లేనందున కాఫీ మొక్కల పెంపకానికి కాఫీ బోర్డు, స్పైస్ బోర్డు అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.ఆపరేషన్ పరివర్తన కింద గంజాయి పంటకు బదులుగా ఇతర మొక్కల విస్తరణకు పోలీసు శాఖ ద్వారా మొక్కలు పంపిణీ చేయాలని ఆదేశించారు. రంపచోడవరం ఐటిడిఎ ఫరిధిలో 1.17 లక్షల మొక్కలు అవసరం కాగా హెచ్ఎన్ టి సి లో 35 వేలు మాత్రమె అందుబాటులో ఉన్నాయని మిగిలిన మొక్కలు కడియం నర్సరీల నుండి తెప్పిస్తామని రంపచోడవరం పిఒ సూరజ్ గనోరే కోరగా వాటి నాణ్యత పరిశీలించాలని,ఆయా నర్సరీలలో అందుబాటులో ఉన్న మొక్కలు చూసి ఆర్డర్ ఇవ్వాలని లేకుంటే సబ్ కాంట్రాక్టర్ ద్వారా నాణ్యత లేని మొక్కలు పంపే అవకాశముందని కలెక్టర్ సూచించారు.అదేవిధంగా ఓడిశా మహారాష్ట్ర నుండి మొక్కలు తెప్పించటానికి గల అవకాశాలు,ధర,నాణ్యత కూడా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.పాడేరు ఐటిడిఎ పిఒ మాట్లాడుతూ,పరివర్తన కింద పది వేల ఎకరాలలో మొక్కలు నాటడం జరిగిందని, ప్రస్తుతం ఐటిడిఎ ఫరిధిలో లక్ష మొక్కలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతమున్న 2.34 లక్షల ఎకరాల్లో గ్యాప్ ఫిల్లింగ్, రిజనువేషన్ కార్యక్రమాల ద్వారా కాఫీ దిగుబడి పెంచాలని కలెక్టర్ సూచించారు.చింతూరు ఐటిడిఎ ఫరిధిలో మొక్కల పెంపకానికి సంబంధించి నిర్వాసితులకు 6,800 ఎకరాలు భూమికి బదులు భూమి ఇవ్వాల్సి ఉండగా వెయ్యి ఎకరాలు మంజూరు చేయడం జరిగిందని, అందులో కూడా ఎటువంటి కార్యకలాపాలు చేయటం లేదని,మిర్చి వేస్తున్నరని ఐటిడిఎ పిఒ చైతన్య కలెక్టర్ దృష్టికి తీసుకురాగా మిర్చి పంట పై నష్టం వచ్చే అవకాశమున్నందున రైతులతో చర్చించి వారికి అవసరమైన ఇతర పంటలవైపు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ ఆపరేషన్ పరివర్తన కింద గంజా సాగు చేస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారని, వారికి అవసరమైన 1.74 లక్షల మొక్కలు కావాలని కోరారు. అదేవిధంగా కొంతమంది ఎంపిడిఓలు అదనంగా విస్తీర్ణ౦ పెంచటానికి మొక్కల అవసరాన్ని కలెక్టర్ దృస్టికి తీసుకురాగా 10 వ తేదీలోగా ప్రతిపాదనలు పంపిస్తే శాంక్షన్ చేస్తామన్నారు.వై.రామవరం, మారేడుమిల్లి మండలాల్లో రబ్బర్ అడుగుతున్నారని వాటిని కూడా ప్రతిపాదించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలక్టరేట్ నుండి డ్వామా పిడి శివయ్య, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఎస్.బిఎస్ నంద్, రమేష్ కుమార్ రావు, మండలాల నుండి ఎంపిడిఓలు, ఎపిడిలు తదితరులు పాల్గొన్నారు.IMG-20240704-WA1005

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.