ఆత్మలకు ప్రభుత్వ పథకాలు
భూలోకంలోనే కాదు పరలోకంలో కూడా సేవలు అందిస్తామంటున్న అధికారులు
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం
ఆత్మలకు ప్రభుత్వ పథకాలు అని ఆలోచిస్తున్నారా అవునండీ చనిపోయన వారికి పింఛను పంపిణీ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని అనుకుంటున్నారా ? అవునండీ… కురుపాం మండలంలోని 23 పంచాయతీల్లో చనిపోయినవారు కూడా పింఛన్లు అందుకుంటున్నారు..! పింఛన్ల పంపిణీలో సిబ్బంది చేతివాటం ప్రదర్శన వెలుగుచూసింది. కురుపాం మండలంలోని నీలకంఠాపురం పంచాయతీతోపాటు పలు పంచాయతీల్లో మృతి చెందినవారికి కూడా పింఛన్లను పంపిణీ చేసినట్లు రికార్డులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలు, వితంతు, వికలాంగులకు ఆర్థిక సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన పింఛన్లలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారన్నమాట..! మండలంలోని ఏకంగా 23 పంచాయితీలలో ఈ చేతివాటం జరిగింది. ఇటీవల అధికారులు చేపట్టిన సామాజిక తనిఖీ లో ఈ అక్రమాలను గుర్తించి బహిర్గతం చేశారు.చర్యలు ఏమి తీసుకుంటారో లేకా ప్రభుత్వ పథకాలు అన్ని లోకాల్లో ఇస్తున్నాం అని ప్రచారం చేస్తారో వేచి చూడాలి