ఏజెన్సీలో ఏనుగుల గుంపు హల్చల్

పంటలు నాశనం చేస్తూ గిరిజనులను హడలెత్తిస్తున్న ఏనుగులు గుంపు

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీ ప్రాంతం అయిన జరడ గ్రామ పంచాయతీ లో నాలుగు అడవి ఏనుగులు గుంపు సంచరిస్తుండడం తో ఆయా ప్రాంత గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.. గిరిజనులు సాగుచేస్తున్నటువంటి కొర్రలు,రాగులు,జొన్నలు వంటి చిరుదాన్యాల పంటలను తొక్కి నాశనం చేస్తుండడం తో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు..తక్షణమే ఏనుగులను తరలించి నష్టపోయిన తమ పంటలకు నష్టపరిహారం అందించాలని ఆయా ప్రాంత గిరిజనులు కోరుతున్నారు...

About The Author: PRUDVIRAJ.M

 మన్యం జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.