స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జులై 18: అల్లూరి సీతారామరాజు జిల్లా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ రంపచోడవరం మండల నూతన కార్యవర్గం అనుకోవటం జరిగింది. జిల్లా సెక్రెటరీ బిషప్ డాక్టర్ చంద్రపాల్ ఇర్లపాటి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. రంపచోడవరం మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా బిషప్,డాక్టర్ గడుతూరి సీమోను( చంటిబాబు )ను అనుకున్నారు.సెక్రటరీగా వి మనోజ్, కోశాధికారిగా పాస్టర్ ఆశీర్వాదమును ఎన్నుకున్నారు.అదేవిధంగా గాస్పెల్ అధ్యక్షునిగా పాస్టర్ జాన్సన్,ఆయనకు సహకారిగా పాస్టర్ బిందెల వెంకన్న బాబును ఎన్నుకోవడం జరిగింది. గురువారం బూలగొండలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రంపచోడవరం అధ్యక్షునిగా ఎన్నిక కాబడ్డ గడుతూరి స్వస్థలం జీకే వీధి మండలం జీకే వీధి మండలం నుండి ఆయన పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాల్లో పర్యటించడం మొదలు పెట్టారు.
ఆయనను రంపచోడవరం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నిక చేయటంతో పలువురు ఆయనను అభినందిస్తున్నారు. జిల్లా సెక్రెటరీ బిషప్ డాక్టర్ చంద్రపాల్ ఇర్లపాటి మాట్లాడుతూ క్రైస్తవ సమాజం ప్రయోజనాల కొరకు, క్రైస్తవుల హక్కు కోసం కృషి చేస్తామని తెలిపారు.