రేపు పాడేరు డివిజన్ లో విద్యా సంస్థలకు స్థానిక సెలవు:జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్

👉🏻రంపచోడవరం, చింతూరు డివిజన్లలో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న సంస్థలకు స్థానిక సెలవు

స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,ఫిబ్రవరి 26:ఈ నెల 27వ తేదీన శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో పాడేరు డివిజన్లో ఉన్న అన్ని విద్యా సంస్థలకు స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసారు. అదేవిధంగా తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబద్రుల నియోజక వర్గానికి ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో రంపచోడవరం,చింతూరు డివిజన్ల ఫరిధిలో పోలింగ్ కేంద్రాలుగా కేటాయించిన భవనాలు ఉన్న సంస్థలకు స్థానిక సెలవుగా కలెక్టర్ ప్రకటించారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.