పోలీస్ మరియు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 10: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో సోమవారం పోలీస్ మరియు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించటం జరిగింది. ఏఎస్పి నవ జ్యోతి మిశ్రా,సీఐ వి.వరప్రసాద్, ఎస్సై కే అప్పలసూరి సారాధ్యంలో ఉచిత కంటి మెగా వైద్య శిబిరంలో సుమారు 136 మందికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడం జరిగింది. వారిలో 43 మందికి కంటి పరీక్షలు అవసరం కాగా వారిని విశాఖపట్నంలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి తరలించడానికి చర్యలు చేపట్టారు. వారికి ఆసుపత్రికి తరలించి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. కంటి ఆపరేషన్ అనంతరం ఉచిత రవాణా సౌకర్యం, ఉచిత భోజన వసతి ఉచిత శాస్త్ర చికిత్స నిర్వహించడం జరుగుతుంది. కంటి ఆపరేషన్ అనంతరం వారికి మూడు రోజులు హాస్పటల్లో డాక్టర్ పర్యవేక్షణలో ఉంచి తరువాత వారందరినీ శంకర్ ఫౌండేషన్ వారు దగ్గర ఉండి బస్సులో జి కే వీధి పోలీస్ స్టేషన్కు తరలిస్తారు. పోలీస్ స్టేషన్ నుండి వారి వారి గ్రామాలకు స్వయంగా పోలీస్ శాఖవారు వాహన సదుపాయం కలగజేసి ఇంటికి పంపిస్తారు. ఈ సందర్భంగా ఉచిత రవాణా సౌకర్యం భోజన వసతి, ఆపరేషన్ సదుపాయం అన్నీ కల్పించినందుకు పోలీస్ శాఖకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.IMG-20250310-WA1007  ఈ కార్యక్రమంలో వైద్యులు హిమబిందు. అచ్యుత్.వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.