మాజీ ప్రభుత్వ ఉద్యోగి సేవా చిన్నబ్బాయి మృతి
గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఫిబ్రవరి 3:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం వంచుల గ్రామానికి చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి సేవా చిన్నబ్బాయి సోమవారం విశాఖపట్నంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం అందరితో సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన చిన్నబ్బాయి మరణ వార్త గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.సేవ చిన్నబ్బాయి ఐటిడిఏ కాఫీ ప్రాజెక్టుకు సంబంధించి సబ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించారు.ఈయన చింతపల్లి,గూడెం కొత్త వీధి, కొయ్యూరు, జి మాడుగుల మండలంలో అధిక శాతం మంది ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉన్నారు. ఈయన మరణ వార్త తెలుసుకున్న పలువురు విషాదంలో మునిగిపోయారు. అందరితో కలిసి మెలిసి సరదాగా ఉండే వ్యక్తి ఒక్కరోజులోనే విగత జీవిగా మారడంతో పలువురు దుఃఖంలో మునిగిపోయారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.