స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి పెన్ పవర్, జులై 26 : అల్లూరి సీతారామరాజు జిల్లాలో వర్షాలు నేపధ్యంలో జిల్లా లోని అన్ని ప్రాధమిక పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ 27వ తేదీ శనివారం కూడా సెలవు ప్రకటించారు.అదేవిధంగా ముంపు మండలాలైన చింతూరు, ఎటపాక, వి.ఆర్ పురం, కూనవరం మండలాల్లో అన్ని పాఠశాలలకు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సెలవులు కొనసాగించాలని పేర్కొన్న విషయం విదితమే. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా లోని 6 నుంచి 10 వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ తరగతులు నిర్వహిస్తున్న అన్ని పాఠశాలు, కళాశాలు ఈనెల 26 వ తేదీ శుక్రవారం నుండి ప్రారంభించిన విషయం కూడా విదితమే.