జీకే వీధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం:ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవిఎన్ఎం అప్పారావు
On
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 19:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం పరిధిలో జీకే వీధి హెడ్ క్వార్టర్స్,సపర్ల, దారకొండ మరియు దుప్పులవాడ పరిధిలో ఈనెల 21వ తేదీ అనగా సోమవారం విద్యుత్ లైన్ లో మరమ్మత్తులు జరగనున్నాయని కావున ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవిఎన్ఎం.అప్పారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కావున జీకే వీధి హెడ్ క్వార్టర్స్, సపర్ల దారకొండ మరియు దుప్పలవాడ ప్రజలు విద్యుత్ శాఖకు సహకరించాల్సిందిగా కోరుతున్నామని అన్నారు.
Tags:
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.