మిరియాలు వలిచే యంత్రాలకు దరఖాస్తులు గడువు పొడిగింపు:జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్

స్టాప్ రిపోర్టర్ పాడేరు,పెన్ పవర్,అక్టోబర్ 10:కేంద్ర ప్రభుత్వం స్పైసెస్ బోర్డు సహకారంతో గిరిజన రైతులకు రాయితీపై మిరియాలు వలిచే యంత్రాలు, శభ్రపరిచే యంత్రాలు పంపిణీ చేయడానికి దరఖాస్తులు స్వీకరణ ఈనెల 20 వరకు గడువు పొడిగించామని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.మిరియాలు వలవడానికి, ఎండబెట్టిన తరువాత శుభ్రం చేయడానికి ఉపయోగ పడే యంత్రాలను గిరిజన రైతులకు 75 శాతం రాయితీపై అందిస్తామన్నారు.యంత్రాలు,విద్యుత్తు,డీజిల్,పెట్రోల్ సహాయంతో పనిచేస్తాయన్నారు.అదే విధంగా అల్లం, పసుపు పాలిష్ చేసే యంత్రాలను 75 శాతం రాయితీపై మంజూరు చేస్తామన్నారు.రైతులు ముందుగా యంత్రాలకు పూర్తిగా చెల్లింపు చేయాలని పేర్కొన్నారు.అనంతరం రైతు ఖాతాకు 75శాతం రాయితీ జమ చేస్తామన్నారు.మిరియాలు,అల్లం, పసుపు సాగు చేస్తున్న గిరిజన రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 90 శాతం రాయితీపై అందిస్తామన్నారు. ఐటిడిఏ కార్యాలయంలో స్పైసెస్ బోర్డు కార్యాలయం లో ఉన్న ఉద్యాన వన విభాగం లో విభాగం లేదా సెరీకల్చర్ లో అక్టోబరు 20 వ తేదీలోగా దరఖాస్తులను అందజేయాలని కోరారు.దరఖాస్తులకు ఆధార్ కార్డు, కులదృవీ కరణ పత్రం, బ్యాంకు పాసు పుస్తకం మొదటి పేజీ, పోడు పట్టా లేదా భూమి పట్టా జెరాక్స్ కాపీలను (కనీసం 1 ఎకరం భూమి) మొబైల్ ఫోన్ నంబరు, పాస్ పోర్టు సైజులను దరఖాస్తులకు జత చేయాలని పేర్కొన్నారు.

.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.