రామ కృష్ణ మిషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
గంగవరం ఏఎస్ఆర్ జిల్లా
200 మందికి వైద్య సేవలు
రామకృష్ణ మిషన్
గిరిజన సంచార వైద్య శాల అధ్వర్యంలో రంపచోడవరం గ్రామ శివారులోని గిరిజన సంచార వైద్యశాలలో ఆదివారం వైద్య శిభిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహారాజ్ తెలిపారు. వైద్య శిబిరంలో వైద్యనిపుణులు డాక్టర్ రాయుడు శ్రీనివాస్, డాక్టర్ దాసరి ఉమా మహేష్ ,డాక్టర్ తలారి వెంకట సుబ్బారావు, డాక్టర్ సంపత్ కుమార్ పాల్గొని సుమారు 200మందికి వైద్య సేవలు అందించినట్లు స్వామీజీ తెలిపారు. అవసరం అయిన 57మందికి రక్తపరీక్షలు, 09మందికి థైరాయిడ్ పరీక్షలు, ఇసిజి ఒకరికి,12మందికి ఎక్స్ రే, లు , 09మందికి ఫిజియథెరపీ లు చేసినట్లు స్వామీజి తెలిపారు.
పరమహంస యోగానంద నేత్రలయం వేమగిరి వారిచే కంటి వైద్యశిబిరం నిర్వహించి 46మందికి కంటి పరీక్షలు చేసి 22మందికి కళ్లజోళ్లు అందించడం జరుగుతుందన్నారు. కంటి ఆపరేషన్ నిమిత్తం ఇద్దరినీ, పరమహంస యోగానంద ఆసుపత్రికి తరలించారు.రామ కృష్ణ మిషన్ అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని, స్వామీజీ కోరారు.
వైద్య శిబిరానికి హాజరైన రోగులకు, సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .ఈ వైద్య శిబిరంలో క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, నక్కా చంటి బాబు, వాలంటీర్ వెంకటలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.