రాజ్మా విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి:సర్పంచ్ వనపల కాసులమ్మ 

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, సెప్టెంబర్ 2: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం వంచుల పంచాయతీ కేంద్రంలో రైతు సేవ కేంద్రం వద్ద రైతులకు 90 శాతం సబ్సిడీ ద్వారా పంపిణీ చేసే రాజ్మా విత్తనాలను ఎన్డిఏ కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్మా విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని దళారులకు విక్రయించవద్దు అని తెలిపారు.అలాగే ఈ పంట నమోదు చేయించుకోవాలని దీనివలన పంట నష్టం సంభవిస్తే నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుందని కావున ఈ పంట నమోదు చేయించుకోవాలని వివరించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చల్లంగి శ్రీధర్, వార్డు సభ్యులు రఘురాం, ఎన్డీఏ కూటమి నాయకులు కొండబాబు,ముర్ల కోటేశ్వరరావు, భూపతి. వైసిపి నాయకులు వనపల రాజేష్, సత్తిబాబు,నడిపి పడాల్, గంగరాజు,అగ్రికల్చర్ అసిస్టెంట్ సింహాచలం, సచివాలయం సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.