నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం
రంపచోడవరం (అల్లూరి జిల్లా)
త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు, వివి ప్యాడ్ లో సిద్ధంగా ఉన్నవని 53 రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి యస్. ప్రశాంత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన 518 ఈవీఎంలు, 518 వివి ప్యాడ్లు అసెంబ్లీకి, పార్లమెంటుకు వేరువేరుగా పాడేరు నుండి వచ్చిన వాటిని వివిధ రాజకీయ ప్రతినిధుల సమక్షంలో సీలులను ఓపెన్ చేసి అదేవిధంగా స్ట్రాంగ్ రూములో భద్రపరిచి సీలు వేసి 24x7 పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 399 పోలింగ్ కేంద్రాలు, 59 మంది సెక్టర్ అధికారులను, 73 మంది రూట్ అధికారులను నియమించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో హెల్ప్ డెస్క్ కు ఏర్పాటు చేయడం జరిగిందని , ఈ డెస్క్ లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తులు తీసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈనెల 18వ తారీకు నుండి 25వ తారీకు వరకు కార్యాలయం పని రోజులలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించుకోవచ్చని, అదేవిధంగా ఒకరోజుకు ముందు సంబంధించిన బ్యాంక్ ఎకౌంటు, కొత్తగా తీసుకున్న పాస్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన తెలిపారు. కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోపు అభ్యర్థులకు సంబంధించిన మూడు వాహనాలకు అనుమతించబడునని అదేవిధంగా నామినేషన్ సమర్పించే అభ్యర్థితో ఐదుగురిని కార్యాలయా లోపలికి అనుమతించబడునని ఆయన తెలిపారు. మే నెల 13వ తారీకు జరుగు ఎన్నికలకు మే నెల 12వ తేదీ రంపచోడవరం జూనియర్ కళాశాల ప్రాంగణంలో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటుచేసి ఈవీఎంలు, వివి ప్యాడ్లు ఎన్నికల సిబ్బందికి అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా మే నెల 13వ తారీకు ఉదయం 7 గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. రెండు గంటలకు ఒకసారి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు తెలియపరిచే విధంగా మండల స్థాయిలో అధికారులను నియమించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గుర్తేడు,పాతకోట పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్ అనంతరం ఈవీఎంలు, వివి ప్యాడ్లు రంపచోడవరం స్ట్రాంగ్ రూముకు హెలికాప్టర్లో తీసుకొచ్చే విధంగా ప్రతిపాదనలు చేయుచున్నామని అదేవిధంగా రంపచోడవరం లోని కౌంటింగ్ ఏర్పాటు కొరకు ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా అడ్డతీగల మండలంలోని పురుషులు 14,678 మంది, స్త్రీలు 16 వేల 152 మంది థర్డ్ జెండర్ ఇద్దరూ మొత్తం 30 వేల 832 మంది, చింతూరు మండలంలోని పురుషులు 14347 మంది, స్త్రీలు 15,767 మంది, థర్డ్ జెండర్ ఇద్దరూ మొత్తం 30116 మంది, దేవీపట్నం మండలంలోని పురుషులు 9931 మంది, స్త్రీలు 11085 మంది, థర్డ్ జెండర్ ఇద్దరూ మొత్తం 21018 మంది, గంగవరం మండలంలోని పురుషులు 10412 మంది, స్త్రీలు 12511 మంది థర్డ్ జెండర్ ఒక్కరు మొత్తం 21 923 మంది, కూనవరం మండలంలోని పురుషులు 9433 మంది, స్త్రీలు 10వేల 904 మంది, థర్డ్ జెండర్ ముగ్గురు మొత్తం 20340 మంది, మారేడుమిల్లి మండలంలోని పురుషులు 7221 మంది, స్త్రీలు 8023 మంది, మొత్తం 15,244 మంది, రంపచోడవరం మండలంలోని పురుషులు 13946 మంది, స్త్రీలు 15,898 మంది, మొత్తం 29844 మంది, రాజవొమ్మంగి మండలంలోని పురుషులు 15,508మంది, స్త్రీలు 16404మంది, మొత్తం 31,912 మంది, వి ఆర్ పురం మండలంలోని పురుషులు 9491 మంది, స్త్రీలు 10395 మంది,థర్డ్ జెండర్ ఒక్కరు మొత్తం 19887 మంది,వై. రామవరం మండలంలోని పురుషులు 10వేల 533 మంది, స్త్రీలు 11,697 మంది, థర్డ్ జెండర్ ఒక్కరు మొత్తం 22,231 మంది, ఏటపాక మండలంలోని పురుషులు 16, 038 మంది, స్త్రీలు 17,167 మంది, థర్డ్ జెండర్ నలుగురు మొత్తం 33,209 మంది, అదేవిధంగా 53 రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం పురుషులు 131537 మంది, స్త్రీలు 145003 మంది, థర్డ్ జెండర్ 16 మంది అదేవిధంగా 2 లక్షల 76 వేల 556 మంది 11 మండలాలలో ఓటర్లు కలరని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు.