వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు గిడుగు:జేసి డాక్టర్ .అభిషేక్

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగష్టు 29: వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు గిడుగు రామమూర్తి అని జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అభిషేక్ అన్నారు.గురువారం రామమూర్తి జన్మదినం పురష్కరించుకొని కలెక్టరేట్ లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామమూర్తి చిత్రపటానికి సంయుక్త కలెక్టర్ డాక్టర్.ఎం.జే, అభిషేక్ పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జేసి మాట్లాడుతూ,తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు. గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి,నిత్య వ్యవహారంలో భాషలో ఉన్న అందాన్నీ,వీలునూ తెలియజెప్పిన మహనీయుడని కొనియాడారు.అతనికి దగ్గరలో ఉన్న అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరికతో తెలుగు,సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు.ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు వ్రాసి, సొంతడబ్బుతో బళ్ళు పెట్టి, అధ్యాపకుల జీతాలు చెల్లించి, సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు.ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913 లో "రావు బహదూర్‌" బిరుదు ఇచ్చారని జేసి గుర్తు చేసారు.1863 ఆగష్టు 29 న జన్మించిన గిడుగు రామమూర్తి తెలుగు బాష అభివృద్ధికి చేసిన ఎనలేని కృషికి ప్రతిఫలంగా ప్రతి ఏడాది ఆయన జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని జేసి వివరించారు. 

 ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి. పద్మావతి,కలెక్టరేట్ ఎఒ ఎం.వి. అప్పారావు, ఉప తహసిల్దార్ చిన్ని కృష్ణ, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.