మమ్మల్ని మన్నించు బాబా..
అల్లూరి జిల్లా, చింతపల్లి పెన్ పవర్ మే 26:
అల్లూరు జిల్లాలో జాతీయ రహదారి 516 ఈ నిర్మాణం కారణంగా చాలా గ్రామాల్లో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆలయాలన్నీటిని తొలగిస్తున్నారు, ఇప్పటికే రింతాడలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని పూర్తిగా తొలగించారు దీంతో గ్రామస్తులు విగ్రహాన్ని మరోచోట ఏర్పాటు చేశారు, చింతపల్లి మండలంలోని లోతుగెడ్డ జంక్షన్ పాటు మడిగుంట తదితర ప్రాంతాల్లో పలు ఆలయాలని తొలగించాల్సి వచ్చింది, తాజాగా చింతపల్లి మండల కేంద్రంలో రహదారి విస్తరణ కారణంగా హనుమాన్ జంక్షన్ బ్రహ్మంగారి ఆలయాన్ని, సాయిబాబా ఆలయాన్ని పూర్తిగా తొలగించారు, రహదారి ఆనుకుని ఉన్న సాయిబాబా ఆలయాన్ని పూర్తిగా తొలగించడంతో బాబా విగ్రహాన్ని కొండపై ఉన్న మరో సాయిబాబా ఆలయం మెట్ల వద్ద ఉంచారు, నిన్న మొన్నటి వరకు భక్తులతో పూజలు అందుకున్న దేవత విగ్రహాలు ఇలా దయనీయంగా మూలకి చేరడాన్ని భక్తులు జీవించుకోలేకపోతున్నారు, అయితే జాతీయ రహదారి విస్తరణ భాగంగా అధికారులు ముందుగానే రహదారి విస్తరణ కారణంగా పూర్తిగా తొలగిస్తున్న ఆలయాలను మరోచోట పున నిర్మించేందుకు వీలుగా లక్షలాది రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నారు ఆలయ కమిటీ పేరిట బ్యాంకుల్లో ఎప్పటికీ నిధులను జమ చేశారు,ఈ నిధులతో మరోచోట ఆలయాలను నిర్మించే వరకు దేవత విగ్రహాలు ఇదిగో ఇలా దయనీయంగా ఉండాల్సిందేనా అని భక్తులు ఆవేదన చెందుతున్నారు నూతన ఆలయాల నిర్మాణానికి స్థల సేకరణ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
About The Author
మన్యం జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.