శ్రీ గౌతమి ఉన్నత పాఠశాల విద్యార్థులు తిరంగా ర్యాలీ  

శ్రీ గౌతమి ఉన్నత పాఠశాల విద్యార్థులు తిరంగా ర్యాలీ  

స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు13: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక శ్రీ గౌతమి ఉన్నత పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. 50 మీటర్ల జాతీయ జెండాను చేతపట్టి పాఠశాల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్,సినిమా హాల్ సెంటర్, అంబేద్కర్ కూడలి మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కళాశాల రాష్ట్ర కన్వీనర్ రవికుమార్, శ్రీ గౌతమి పాఠశాల చైర్మన్ తామర మాణిక్యం సంయుక్తంగా జెండాను ఊపి ప్రారంభించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ దేశభక్తిని పెంపొందించే నినాదాలు చేస్తూ విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. శ్రీ గౌతమీ పాఠశాల ప్రిన్సిపాల్ దాడి వెంకట శివ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు పాంగి రాజారావు,సల్ల రామకృష్ణ, శాంతా కుమారి, రాఘవేంద్రరావు,పాఠశాల పిఈటి ఊలం ఈశ్వర్,ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.