సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహణే లక్ష్యంగా పటిష్ట చర్యలు
ప్రజలు స్వేచ్ఛగా , నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి*
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహణే లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని రేపల్లె నియెజకవర్గం పరిధిలో చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏప్రిల్ 20 న శనివారం జిల్లా ఎస్పీ పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి అధికారులకు పలు సూచనలు చేసినారు.
రేపల్లె నియోజకవర్గం లోని చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంబొట్లపాలెం, గుళ్ళపల్లి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను, నగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నగరం, బోరుమాదిగ పల్లి, యేలేటిపాలెం గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను, నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపట్నం, ఆముదాలపల్లి, గోకర్ణమఠం తదితర సమస్యాత్మక గ్రామాలలోని పోలింగ్ కేందారాలను జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని, పోలింగ్ కు ముందు రోజే తగిన లైటింగ్, బ్యారికేటింగ్ ఏర్పాటు చేయించుకోవాలన్నారు. పోలీంగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన భద్రత చర్యల తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అన్నిచోట్ల అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రశాంతవాతావరణంలో జరుగుతుందన్నారు. మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను గుర్తించి, వాటిలో గతంలో ఏదైనా అవాంఛనీయ ఘటనలో జరిగిన (లేదా) జరగడానికి అవకాశం ఉన్న గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా, మిగిలిన వాటిని సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ రోజు రేపల్లె నియోజకవర్గం లోని సమస్యాత్మక గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవలసిన భద్రతాపరమైన చర్యలు, క్యూలైన్ల ఏర్పాటు, తగిన లైటింగ్, బారికేడింగ్ తదితర విషయాల గురించి పోలీస్ అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. నిజాంపట్నం, చందోలు పరిధిలోని ఎస్.ఎస్.టి బృందాలు ఎలా విధులు నిర్వహిస్తున్నారు, వాహన తనిఖీలు ఎలా నిర్వహిస్తున్నారు, వారి పనితీరు ఎలా ఉందని తనిఖీ చేసి వారికి సూచనలు ఇవ్వడం జరిగిందని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అనుక్షణం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు రేపల్లె డిఎస్పి టి.మురళీకృష్ణ గారు, రేపల్లె రూరల్ సీఐ మల్లికార్జున , ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
బాపట్ల