నాటుసారా తయారీ, అమ్మకం, బెల్ట్ షాప్ ల అమ్మకం నిఘా పెంచి నిరోదించాలని ఎస్ఈబి డిప్యూటీ కమీషనర్ ఎం.శంకరయ్య అన్నారు. ఎస్ఈబి కమీషనర్ ఎం.రవి ప్రకాష్ ఆదేశాల మేరకు శుక్రవారం కొవ్వూరు ఎస్ఈబి స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమీషనర్ ఎం.శంకరయ్య మాట్లాడుతూ ఎన్నికల విధులలో నిర్లక్ష్యం తగదని, నాటుసారా తయారీ, అమ్మకం, బెల్ట్ షాప్ ల అమ్మకం నిరోధించాలన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్నందున విధులలో అలస్త్వం తగదని, అక్రమ మద్యం నిల్వలను గుర్తించి మద్యరహిత ఎన్నికల నిర్వహణకు నడుం కట్టాలని సూచించారు. అనంతరం స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి.శ్రీనివాసరావు, ఎస్సై ఎన్.కళ్యాణి, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం నిల్వలపై నిఘా పెట్టండి-ఎస్ఈబి డిప్యూటీ కమిషనర్ ఏం.శంకరయ్య
కొవ్వూరు