రెండు ఓట్లు ప్యాన్ గుర్తుపై వేయండి

జీలుగుమిల్లి

రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ప్యాన్ గుర్హుపై వేసి  తనను, ఏలూరు వైకాపా పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ ను గెలిపించాలని పోలవరం వైకాపా అభ్యార్ది తెల్లం రాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం మండలంలోని అంకన్నగూడెం, రాచన్నగూడెం పంచాయితీ ల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటిటికి వెళ్లి ఓట్లను అభ్యర్ధించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని కోరారు. నవరత్నాలు అమలు కావాలంటే వైకాపాను గెలిపించాలన్నారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకుల హామీలు విని మోసపోవద్దని అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని అన్నారు. ఈ కార్యాక్రమంలో మండల వైకాపా కన్వీనర్ సందా ప్రసాద్, ఎంపిపి పోచమ్మ, జడ్ పి టీ సి వసంతరావు, నాయకులు వనమా రామకృష్ణ,, సర్పంచ్ సున్నం వరలక్ష్మి, పేదా వెంకటేశ్వరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

About The Author: Admin