పలుకూరులో సైకిల్ హవా --ఇంటూరి సమక్షంలో టిడిపిలో చేరికలు

కందుకూరు

మండలంలోని పలుకూరులో సైకిల్ స్పీడ్ పెరిగింది. నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈదర సింగయ్య, వెంకటరావు, వెంకటేశ్వర్లు, శ్రీధర్, షేక్ రహంతుల్లా, ఉప్పలపాటి మధు, పేముల బసవయ్య, గండి సుబ్బయ్య, చెంబేటి అంజి, పల్లపు అంకారావు, ఇంద్రకంటి మాధవరావు, వీరమల్లి చిన్న తదితరులు పార్టీలో చేరారు.
మండల పార్టీ అధ్యక్షుడు నార్నే రోశయ్య, సీనియర్ నాయకులు ఎడ్లపల్లి వెంకట నరసింహం, బొద్దులూరి కొండలరావు, ఈదర సుధాకర్, తన్నీరు బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

About The Author: Admin