పొదిలిలో నాలుగవ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు 

ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సమస్యల్ని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి

డిస్పాచ్ మెకానిక్ కృష్ణ పై చర్యలు తీసుకోవాలి


పొదిలి, పెన్ పవర్ జూలై 18 : 
పొదిలి ఆర్టీసీ డిపోలో యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఎంప్లాయిస్ యూనియన్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమం గురువారం నాటికి నాలుగ వ రోజుకు చేరుకుంది 4వ రోజు డిపోకు చెందిన ఎస్కే చాంద్ భాష, ఎం చిన్నయ్య అనే ఇరువురు కార్మికులు నిరాహార దీక్షలో కూర్చున్నారు ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎస్.కె ఖాదర్ భాష, షేక్ జిలాని, ఓబులేసు, వెంకట్రావు, కొండయ్య తదితరులు మాట్లాడుతూ ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సమస్యల్ని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అలాగే డ్రైవర్లపై పక్షపాత వైఖరి అవలంబిస్తున్న డిస్పాచ్ మెకానిక్ కృష్ణ పై చర్యలు తీసుకోవాలని, అతన్ని వెంటనే బదిలీ చేయాలని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కోరారు అలాగే తనకు అనుకూలమైన కార్మికులకు అక్రమంగా మాస్టర్లు ఇస్తూ, సమస్త కు ఆర్థికంగా నష్టపరుస్తున్న ట్రాఫిక్ విభాగపు సూపరిండెంట్ ను బదిలీ చేయాలని, డిపో అధికారులు కార్మికులపై కక్ష సాధింపు చర్యలను విడనాడాలని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కోరారు.

About The Author: Admin