దర్శి ప్రభుత్వ హాస్పిటల్ అకస్మిక పరిశీలన : డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
దర్శి, పెన్ పవర్ జూలై 18:
దర్శి పట్టణం లోని ప్రభుత్వ హాస్పిటల్ ని పరిశీలించిన దర్శి నియోజకవర్గ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వారితో పాటుగా దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, హాస్పిటల్ హెడ్ డాక్టర్ సుమన్ , ఇతర డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ...అయిదేళ్ల అనారోగ్యానికి పూర్తిస్థాయిలో చికిత్స చేయడమే కూటమి ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి . అయిదేళ్ల పాటు జగన్ రెడ్డి మార్కు కనికట్టు కేటాయింపులు, మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకాలపై శీతకన్ను, అంతు లేని అవినీతితో ప్రజారోగ్య రంగమే వెంటిలేటర్‌పై చేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడవన్నీ చక్కదిద్ది ప్రజల ఆరోగ్యాలకు భరోసా ఇవ్వడమే ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతాంశంగా తీసుకుందన్నారు. గురువారం దర్శి ప్రభుత్వ ఆస్పత్రిని గొట్టిపాటి లక్ష్మి ఆకస్మికంగా వెళ్లి పరిశీలిచారు. అన్ని విభాగాల్లోకి వెళ్లి రోగులకు అందుతున్న సేవలు, వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో మాట్లాడి ఆస్పత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. విభాగాల వారీగా సమస్యలు, ఆస్పత్రికి కావాల్సిన పరికరాలు, సిబ్బంది, ఇతర వివరాలు హాస్పటల్ లో ఉన్న డాక్టర్ సుమన్ ని అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ కి ముఖ్యంగా మార్చురి గది అవసరం అని డాక్టర్ చెప్పగా ఎస్టిమేషన్ వేపించి శాంక్షన్ చెపిస్తాను అన్నారు డెలివరికి సంభందించిన ఏక్యూప్ మెంట్ మిషనరీ అడిగారు ఆ మిషనరీ తానే స్వయంగా ట్రస్ట్ ద్వారా సమకూరుస్తానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ హామీ ఇచ్చారు. హాస్పిటల్ లో తాగునిటీ సమస్య ఉందని చెప్పగా.. RO వాటర్ ప్లాంట్ ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు హాస్పిటల్ లోని అన్నీ విభాగలు తానే స్వయం గా తిరిగి క్షుణ్ణం పరిశీలించారు. హాస్పిటల్ లో ఎంతమంది డాక్టర్ లు ఉన్నారో రిజిస్టార్, స్టాఫ్ రిజిస్టార్, పరిశీలించారు. నియోజకవర్గస్థాయి ఆసుపత్రిలో ఏమాత్రం లేదని ఒక డాక్టర్ గా నాకు ఇక్కడ వస్తువులు చూశాక ఆవేదన కలిగిస్తుంది అన్నారు. నేను ఒక డాక్టర్ గా నా మొదటి ప్రాధాన్యత నియోజకవర్గం పేద వర్గాలకు వైద్యవస్థ కల్పించడం నా బాధ్యత అన్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు దర్శి ఆసుపత్రి అభివృద్ధికి హామీ ఇచ్చారని తెలిపారు. ఆసుపత్రికి అవసరమైన వస్తువుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరుకు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ని, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు డోలా వీరాంజనేయులుని, గొట్టిపాటి రవికుమార్ ని అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ని కలిసి ఆసుపత్రి అభివృద్ధి చేసి ప్రజలందరికీ వైద్యం అందుబాటులోకి తేవడమే నా ధ్యేయమన్నారు. అక్కడి రోగులను అడిగి వారి బాధలను అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో వస్తువులు, మార్చరీ రూమ్ ఏర్పాటు పరిసరాల పరిశుభ్రత శానిటరీ, మెరుగుదల మరుగుదొడ్ల క్లీనింగ్, గ్రినరీ ఇలా ఆసుపత్రిని సుందరంగా తీర్చిదిద్ది అన్ని రంగులతో దర్శి నియోజకవర్గ స్థాయి ఆసుపత్రిగా రూపుదిద్దుకునే విధంగా కృషి చేస్తానని వివరించారు. ఈ కార్యక్రమం లో దర్శి మున్సిపల్ వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్ లు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.