ఆర్ సి ఇన్ చార్జీ యర్రగొండపాలెం పెన్ పవర్ నవంబర్ 10
మండే ఎండైనా ,వానైనా దుమ్ము దూలితో పోరాడుతూ చిరు వ్యాపారులు ఆర్ అండ్ బి రోడ్డుపై అద్దె బ్రతుకులు బ్రతుకుతున్నారు. మార్కాపురం మాచర్ల రోడ్డు లోని జాతీయ రహదారికి ఇరువైపుల తోపుడు బండ్లపై పూలుబండ్లు, అరటి పండ్లు, ఇడ్లీ బండ్ల వ్యాపారులు రోడ్డు పై వ్యాపారాలు చేస్తున్నందుకు రోడ్డుకు ఇరువైపుల గృహ యజమానులకు వేలకు వేలు అద్దెలు చెల్లించక తప్పడం లేదు .తోపుడుబండ్లపై కూరగాయాలు,కాయలు అమ్ముకునే వ్యక్తి ఎవరైనా ఆర్ అండ్ బి రోడ్డుకు పై తోపుడు బండి పెట్టాలన్నా, బండి వెనకవైపు ఉన్న గృహ యజమానికి 10వేలకు పై అడ్వాన్స్, మరియు నెలకు దాదాపు 5 వేలు అద్దె చెల్లించక తప్పడంలేదు. అంతే కాకుండా ఉదయం ఒకరికి సాయంత్రం మరొకరికి ఆర్ అండ్ బి స్థలాన్ని అద్దెలకు ఇస్తూ, దినసరి చిరు వ్యాపారుల నుంచి రోడ్డుకు ఇరు వైపులు ఉన్న గృహాల యజమానులు వేలకు వేలు వసూలుస్తున్నారు. రోడ్డు పై తోపుడు బండ్లతో వ్యాపారాలు చేసే వారిపై పోలీసులు న్యూసెన్స్ కేసులు నమోదు చేస్తూ ఉండటంతో చిరు వ్యాపారుల పరిస్థితి ముందు నొయ్యి వెనక గోయ్యిగా మారింది. ఆర్ అండ్ బీ స్థలంలో తోపుడుబండ్ల వ్యాపారాలు చేస్తూ రోజంతా తోపుడు బండ్లు పెట్టి కాయలు అమ్ముకుంటున్నామని, తమకు ఒక పక్క ఇంటి అద్దెలు మరో పక్క ఆర్ అండ్ బి రోడ్డుకు అద్దెలు కట్టలేక అల్లాడుతున్నామని చిరు వ్యాపారులు వాపోతున్నారు . సెంటర్లో చిరు వ్యాపారులకు స్దలాలను కేటాయిస్తే, అద్దెల బాధలు తగ్గుతాయని స్థానిక నాయకులను, అధికారులను చిరు వ్యాపారులు కొరుతున్నారు. రోజువారి కూలీలుగా బతికీడిస్తూ అద్దె బతుకులు బతుకుతున్నామని తమ పై జాలిచూపాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.
ఆక్రమణలు తొలగిస్తే సమస్య పరిష్కారం
మార్కాపురం పట్టణంలో ఆర్ అండ్ బి రోడ్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన వారిపై కొరడా జులిపించినట్లు,యర్రగొండపాలెం జాతీయ రహదారిపై వారికున్న రిజిస్టేృషన్ హద్డులను దాటి ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతున్నారా..లేక జేబులు నింపుకున్నారా అనే విమర్శలు వినపడుతున్నాయి.రోడ్డుపైన ద్విచక్ర వాహనం ,లేక ఇతర వాహానం ఆపాలన్న ఆర్ అండ్ బి స్దలం వారి తాతా జాగీరులాగా వాదనలకు దిగడం హాస్యస్పదం.ఇప్పటికైన యర్రగొండపాలెం ఆర్ అండ్ బి రోడ్డును ఆక్రమించుకుని అద్దెల రూపంలో దంధా కొనసాగిస్తున్నా తెరచాటు మాఫియా పై చర్యలు తీసుకోవాలని, అధికారులు చర్యలు చేపడితే తోపుడు బండ్లపై బ్రతుకీడుసస్తున్నా చిరు వ్యాపారుల సమస్య పరిష్కారం అవుతుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.