ePaper
Thursday, May 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుజీకే వీధిలో శ్రీరామ నవమి ఉత్సవాల సందడి ప్రారంభం

జీకే వీధిలో శ్రీరామ నవమి ఉత్సవాల సందడి ప్రారంభం

📰 Generate e-Paper Clip

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 25:

మండలంలోని జీకే వీధిలో శ్రీ రామ నవమి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. ఈ నెల 27 న జరిగే వేడుకలకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. అదే రోజు సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.ఇందుకోసం బుధవారం ఉత్సవ పందిరి రాట కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. మహిళలు, గిరిజనులు పూజలు చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. 27న ఉత్సవమూర్తుల ఊరేగింపు, కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గొర్లె వీర వెంకట్, బిజెపి నాయకులు రిమెల పాల్, ఎంపీటీసీ రాజేశ్వరి, పెద్దలు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular