ePaper
Tuesday, March 31, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా కొత్తాడ లో కార్డెన్ అండ్ సెర్చ్

ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా కొత్తాడ లో కార్డెన్ అండ్ సెర్చ్

📰 Generate e-Paper Clip

 

గంగవరం, పెన్ పవర్, మార్చి 31:
పోలవరం జిల్లాలో “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తాడ గ్రామంలో పోలీసులు మంగళవారం ఉదయం విస్తృతంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.అడ్డతీగల సీఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో గంగవరం ఎస్సై వెంకయ్య, అడ్డతీగల ఎస్సై వినోద్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది గ్రామంలో అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, పత్రాలు లేని మూడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా గ్రామ ప్రజలకు గుప్త నిధులు, మూఢనమ్మకాలు, గంజాయి వినియోగం నివారణ, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ప్రజలు చట్టాలకు అనుగుణంగా నడుచుకొని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular