ePaper
Saturday, March 21, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌కు ఆలయ మర్యాదలతో ఆశీర్వచనం

ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌కు ఆలయ మర్యాదలతో ఆశీర్వచనం

📰 Generate e-Paper Clip

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 21:

చిలకలూరిపేట : పట్టణంలోని బెస్తపాలెంలో వేంచేసియున్న శ్రీ సీతారామ సమేత కావమ్మ తల్లి మారయ్య స్వామి వార్ల దేవస్థానం ఉగాది ఉత్సవాల సందర్భంగా శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ని ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉగాది పర్వదినం నాడు నిర్వహించిన పవిత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వాన కమిటీ సభ్యులు ఆయనను కోరినప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఆయన అందుబాటులో లేకపోవడంతో వేడుకల్లో పాల్గొనలేకపోయారు.ఈ నేపథ్యంలో, ఆలయ కమిటీ పెద్దలు మర్రి రాజశేఖర్ నివాసానికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు. దేవస్థాన ప్రధాన అర్చకులు జొన్నాదుల రవిబాబు వేద మంత్రోచ్చారణల మధ్య ఆయనకు ఆశీర్వచనాలు అందజేయగా, కమిటీ సభ్యులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను సమర్పించారు.ఈ సందర్భంగా శ్రీ సీతారామ స్వామి వార్ల చిత్రపటంతో పాటు, గత ఏడాది ఉత్సవాల్లో మర్రి రాజశేఖర్ పాల్గొన్నప్పటి మధుర స్మృతులతో కూడిన చిత్రపటాన్ని ఆయనకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో సాపా వీర రాఘవులు,సాపా వెంకట రామారావు,తంగిరాల హనుమంత రెడ్డి, సాపా ఆదినారాయణ,ఇమ్మడి సురేంద్ర,బోడపాటి హనుమంతు,వడ్లమూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ వివరాలు

పేరు: SRIKANTH NARASIMHALA
హోదా: STAFF REPORTER
ప్రాంతం: CHILAKALURI PETA, PALNADU DIST
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular