పాడేరు, పెన్ పవర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. ఏఎస్ఆర్ (అల్లూరి సీతారామరాజు) జిల్లా కలెక్టర్‌గా 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రీమతి టి. నిశాంతిని నియమించింది.ప్రస్తుతం కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నిశాంతి, పదోన్నతి పొందుతూ ఈ నియామకం పొందారు. ఆమెను ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నిశాంతి పరిపాలనా అనుభవం, పనితీరు దృష్ట్యా ఈ బాధ్యతలు అప్పగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలో అభివృద్ధి, పరిపాలనలో మరింత పురోగతి సాధించేందుకు ఆమె కృషి చేయనున్నట్లు భావిస్తున్నారు.

