ePaper
Monday, March 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడకాజులూరులో టీడీపీ కార్యకర్తకు ఘన సన్మానం

కాజులూరులో టీడీపీ కార్యకర్తకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

కాజులూరు, పెన్ పవర్,మార్చి 30: రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలానికి చెందిన టీడీపీ నాయకుడు రెడ్డి శేషగిరిరావును పార్టీ సేవలకు గాను ఘనంగా సన్మానించారు. 2023, 2024 సంవత్సరాల్లో “బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ” కార్యక్రమంలో యూనిట్ ఇన్‌చార్జిగా డోర్ టు డోర్ ప్రచారంలో చురుకుగా పాల్గొనడంతో పాటు, 2025లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో సైతం విశేషంగా కృషి చేసినందుకు ఆయనకు ఈ గౌరవం లభించింది.తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా శేషగిరిరావును ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కాజులూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను అభినందిస్తూ, పార్టీ అభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular