ePaper
Wednesday, March 25, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుగంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి –

గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి –

📰 Generate e-Paper Clip

గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి –

 జిల్లా  కలెక్టర్ .ఎఎస్.దినేష్ కుమార్

 జిల్లా అధికారులతో అంకార్ట్ సమావేశం  

స్టాప్ రిపోర్టర్,పాడేరు, మార్చి 24:

జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంకార్డ్‌పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా గంజాయి ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించాలని పేర్కొన్నారు. గంజాయి బారిన పడిన వారికి వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందించడంలో ఆరోగ్య శాఖ చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. గంజాయికి బానిసలైన వారికి కేవలం హెచ్చరికలు కాకుండా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి, వారిని సమాజంలో గౌరవంగా జీవించేందుకు ప్రోత్సహించాలని కలెక్టర్ చెప్పారు. రైతులకు గంజాయి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని, ఇందుకు ప్రభుత్వ పథకాల అనుసంధానం చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్, ఎక్సైజ్ శాఖలను ఆదేశించారు. గ్రామాల్లో, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. అలాగే డ్రాప్ అవుట్ పిల్లలకు విద్యపై అవగాహన కల్పించి, యువతను వృత్తి విద్య వైపు మళ్లించాలని సూచించారు.మరోవైపు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ గంజాయి రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.బి.ఎస్. నందు, డీఎల్పీఓ పి.ఎస్. కుమార్, పీడీ డ్వామా విద్యసాగర్, పీడీ డీఆర్డీఏ వి. మురళి, డీఈఓ కృష్ణారావు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ పి.బి.కె. పరిమిల, ఎల్‌డీఎం మాతు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular