- టీడీపీ హాయాంలో నిర్మించిన ఇళ్లకు రంగులేసి, లబ్ధిదారులకు తలనొప్పులు సృష్టించిన జగన్ నిర్వాకంతో పేదలు ఇబ్బందులు పడ్డారు
- పట్టణ శివారల్లో 52 ఎకరాల సముదాయంలో నిర్మించిన టిడ్కో గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి
- ఇళ్లు పొందిన లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి, గృహ ప్రవేశాలు చేయించిన ప్రత్తిపాటి
- టిడ్కో గృమ సముదాయాన్ని మినీసిటీగా మారుస్తాం : ప్రత్తిపాటి
- ఇప్పటికే రూ.11.79 కోట్లతో విద్య, వైద్య భవనాలు, దుకాణ సముదాయాలు, ఇతర మౌలిక వసతుల కల్పన పనుల నిర్మాణం చేపట్టాం : ప్రత్తిపాటి
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 30 :
చిలకలూరిపేట : లక్షలాది పేదల సొంతింటికలను నేడు కూటమిప్రభుత్వం సాకారం చేసిందని, 2.50 లక్షల ఇళ్లల్లో వెలుగులు నింపిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం పట్టణ శివార్లలోని 52 ఎకరాల సముదాయంలో ఫేజ్-2లో నిర్మించిన 1008 టిడ్కో ఇళ్లల్లో కొన్నింటిని లబ్ధిదారులు, కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి, వారితో గృహ ప్రవేశాలు చేయించిన అనంతరం ప్రత్తిపాటి విలేకరులతో మాట్లాడారు.
టీడీపీ హాయాంలో 90శాతం పూర్తయిన ఇళ్లను జగన్ పాడుపెట్టాడు
2014-19లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకోసం నిర్మించిన, 90 శాతం వరకు పూర్తయిన ఇళ్లను జగన్ అధికారంలోకి పాడుపెట్టాడన్నారు. కేవలం కొన్ని చోట్ల రంగులు వేయించి, టీడీపీ హాయాంలో ఇళ్లు పొందిన లబ్ధిదారుల్ని కాదని, ఇతరులకు వాటికి కేటాయించి తలనొప్పులు సృష్టించి, ఆర్భాటంగా అంతా తానే చేసినట్టు ప్రచారం చేసుకున్నాడని ప్రత్తిపాటి పేర్కొన్నారు.
కూటమిప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 22 నెలల్లోనే 5లక్షల ఇళ్లను సకల హంగులతో లబ్ధిదారులకు అప్పగించిందన్నారు. చిలకలూరిపేటలో గతంలో 4,512 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించినట్టు ప్రత్తిపాటి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మిగిలిన ఇళ్లల్లో ఒక్కశాతం పనులు కూడా పూర్తిచేయకుండా లబ్ధిదారులకు వడ్డీల భారం పెంచితే, కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నింటినీ పూర్తిచేసి, పేదల సొంతింటి కలను సాకారం చేసిందన్నారు. నేడు ఫేజ్-2 లో పూర్తిచేసిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించామన్నారు. ఇళ్లు ఖాళీగా ఉంటే ఊరుకోబోమని లబ్ధిదారులకు స్పష్టం చేశామన్నారు. గృహాలు పొందిన వారంతా తప్పకుండా ఇళ్లళ్లో ఉండాల్సిందేనని, ఉండటానికి వీలుపడని వారు మాత్రమే అద్దెలకు ఇవ్వాలని చెప్పామన్నారు. ఎవరైతే కచ్చితంగా ఇళ్లల్లో ఉంటారో వారికే ఇకపై ఇళ్లు కేటాయిస్తామని, దానిలో ఎలాంటి మినహాయింపు ఉండబోదని ప్రత్తిపాటి తేల్చిచెప్పారు. విడిగా మద్ది నగర్లో ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్నవారితో కూడా గృహ ప్రవేశాలు చేయించినట్టు ప్రత్తిపాటి చెప్పారు.
టిడ్కో గృహ సముదాయాన్ని మినిసిటీగా అభివృద్ధి చేస్తాం..
పట్టణంలోని పేదలకోసం రెండోదశలో నిర్మించిన 1008 టిడ్కో ఇళ్లలో కొన్నింటిని నేడు లబ్ధిదారులకు అప్పగించామన్న ప్రత్తిపాటి.. రెండునెలల్లో అన్నింటినీ పూర్తిచేస్తామన్నారు. టిడ్కో గృహ సముదాయాల్లోనే దుకాణ సముదాయాలు, ప్రార్థనా మందిరాలు, శ్మశాన వాటికలు సహా అన్నిరకాల వసతులు కల్పిస్తున్నామని, వాటికి సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయని ప్రత్తిపాటి తెలిపారు. టిడ్కో గృహాల్లో ఉండేవారు కమిటీలుగా ఏర్పడితే, దశలవారీగా అన్ని సౌకర్యాలు ఒనగూరుతాయన్నారు. టిడ్కో గృహ సముదాయాన్ని మినిసిటీగా తీర్చిదిద్దుతామని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.11.79 కోట్లతో ప్రార్థనా మందిరాలు, దుకాణసముదాయాలు, విద్య, వైద్య భవనాలు నిర్మాణం చేపట్టినట్టు ఆయన చెప్పారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొత్త కోటేశ్వరరావు, ముల్లా కరీముల్లా , షేక్ మస్తాన్ వలి, బేరింగ్ మౌలాలి మెప్మా పిడి, మున్సిపల్ డీఈ అబ్దుల్ రహీమ్, షాపుజి పల్లంజి అధికారులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, టీడీపీ, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జగన్ కల్లగా మార్చిన పేదల కలను చంద్రబాబు నిజం చేశారు : ప్రత్తిపాటి
RELATED ARTICLES

