ePaper
Friday, March 27, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినర్సీపట్నంలో అట్టహాసంగా మరిడమ్మ రెండవ జాగారం

నర్సీపట్నంలో అట్టహాసంగా మరిడమ్మ రెండవ జాగారం

📰 Generate e-Paper Clip

*నర్సీపట్నంలో అట్టహాసంగా  మరిడమ్మ రెండవ జాగారం*

*-జాతరలో సాంప్రదాయాలకు పెద్దపీట*

*-ఆద్యంతం జాతర పర్యవేక్షణలో చింతకాయల విజయ్ , రాజేష్*

*నర్సీపట్నం, పెన్ పవర్ :*

​నర్సీపట్నంలో శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి గరగల జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, ఉత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. రెండవ జాగారం సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాత నివాసం వద్ద  గరగలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల అనంతరం గరగలు  అయ్యన్నపాత్రుడు పాత ఇంటి వద్ద నుంచి బయల్దేరి లాలం జామీలు ఇంటి మీద నుండి పోలీసు స్టేషన్ మీదుగా రెల్లివీధి రామాలయం మీదుగా SC కాలనీ,  BC కాలనీ, కలాసి కాలనీ, పీనారిపాలెం మీదుగా  సి‌బి‌ఎం కాంపౌండ్, గచ్చపువీధి రామాలయం మీదుగా గర్ల్స్ హై స్కూల్ లైన్ నుండి శివపురం మీదుగా, కృష్ణదేవీపేట మెయిన్ రోడ్డు, శివపురం వీధిలోకి వెళ్ళి, పక్కవీధిలో నుండి కృష్ణదేవిపేట మెయిన్ రోడ్డుకు వచ్చి, అక్కడి నుండి బైలపూడి గంగరాజు ఇంటి పక్కనుండి, శివపురం చాకలి పేట తిరిగి చుట్ల కొండ ఇంటి మీదుగా మెయిన్ రోడ్డు కి వచ్చి, ధనిమిరెడ్డి వీధి నుండి టి‌టి‌డి కళ్యాణ మండపం, గంగాధర్ ధియేటర్ వీధిలో నుండి ఐస్ పార్లర్ లైను, బొంతు వీధి సాయిబాబా గుడి మీదుగా అబిద్ సెంటర్ కి వచ్చి, పాలఘాట్ సెంటర్, ఆర్డీవో ఆఫీసు వెనుక, వంశీ స్కూల్ రోడ్డులో నుండి  బుచ్చిరాజు కొట్టు, అక్కడినుండి పప్పల వారి లైను లో నుండి చినరమణ లైను నుండి కాపు వీధి రామాలయం నుండి ఎర్రా భీమినాయుడు సెంటర్, పోలీసు స్టేషన్ మీదుగా అయ్యన్నపాత్రుడు పాత ఇంటి రామాలయం వద్దకు గరగలు చేరుకున్నాయి.  ఆనవాయితీగా వస్తున్న ఈ  సాంప్రదాయాలను ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగించారు. నూకాలమ్మ మరియు మరిడమ్మ జాతరలు అయ్యన్న పాత్రుడు కుటుంబానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగలు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దశాబ్దాలుగా ఎంతో నిష్టతో నిర్వర్తిస్తున్న ఈ బాధ్యతలను, ఇప్పుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, అంతే భక్తితో తన భుజాలపై వేసుకున్నారు.
​డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాల మధ్య పురవీధుల్లో సాగుతున్న గరగల ఊరేగింపు  ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, ఈ పండుగను చింతకాయల విజయ్, రాజేష్  ముందుండి నడిపిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular