ePaper
Wednesday, March 4, 2026
spot_img
ePaper
Homeఎడిటోరియల్నోటీసులతో..! సెటిల్మెంట్‌లు..?

నోటీసులతో..! సెటిల్మెంట్‌లు..?

📰 Generate e-Paper Clip

హద్దుమీరుతున్న టౌన్‌ప్లానింగ్ అధికారుల విధుల నిర్వహణ..!

అంతా బహిరంగమే..! ఉన్నతాధికారులకు వాటాలు..?మరి పట్టించుకునేది ఎవరు..?

అక్రమ కట్టడాల నియంత్రణే లేనప్పుడు.! “టౌన్‌ప్లానింగ్” వ్యవస్థ దేనికి వసూళ్ళకా..!

*అక్రమార్కుల కంటే.. అధికారుల చేతివాటమే మిన్న..?

బౌరంపేట్ డిపిఎస్ ఎదురుగా భారీ అక్రమ షెడ్డుపై ఫిబ్రవరి 20న ఏసిపి దృష్టికి..

మల్లంపేట్‌‌లోని గ్రీన్‌పార్క్ అసోసియేట్‌లో ఎనిమిది అక్రమ కమర్షియల్ షెడ్లు..

దుండిగల్‌, పెన్ పవర్, మార్చి 3:

దుండిగల్‌ సర్కిల్ మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి టౌన్‌ప్లానింగ్‌లో కరెప్షన్ తాండవిస్తూనే ఉంది..! ఒక్క మాటలో చెప్పాలంటే..! కొందరు అవినీతి అధికారుల ఆధాయాన్ని మరింత పెంచేందుకు.. ఈ విలీన ప్రక్రియ తోడైందని కూడా, మున్సిపాలిటీలో చర్చనీయాంశంగా మారింది..? మరోవైపు అక్రమ కట్టడాలకు అనధికారికంగా సహకారించడానికి చట్టబద్దత కల్పించారేమో అనే అనుమానాలను రేకెత్తిస్తుంది.. దుండిగల్‌ టౌన్‌ప్లానింగ్ టిపిఎస్ సంజునాపై ఏసిబి దాడులు కేసునమోదు చేసినా.. ప్రస్తుతం విధుల్లో ఉన్న టౌన్‌ప్లానింగ్ అధికారులకు భయం లేకుండా పోయింది.. అక్రమ షెడ్లు, నిర్మాణాలకు నోటీసులు జారీచేసిన దుండిగల్‌ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు బరితెగించి వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.. టౌన్‌ప్లానింగ్ అధికారుల అక్రమార్జనకు “చైన్‌మెన్‌‌లు” (ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు) సెటిల్మెంట్‌ల వ్యవహారంలో కీలంగా ఉన్నారని..? తక్షణమే తప్పుడు చైన్‌మెన్‌‌‌లను గుర్తించి, ఇతర శాఖలకు మార్చాలని మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు..

బౌరంపేట్‌లో అక్రమ షెడ్డుపై ‘ఏసిపి’ నిర్లక్ష్యం..

దుండిగల్‌ సర్కిల్ పట్టణప్రణాళిక అధికారుల నిర్లక్ష్యమో..! లేక తమకు ఎదురు ఎవరు అనే, బరితెగింపో తెలియదు కానీ..! అక్రమ నిర్మాణాల పట్ల టౌన్‌ప్లానింగ్ తీరు పలువురికి ఆగ్రహం తెప్పిస్తుంది.. బౌరంపేట్ “డిల్లీ పబ్లిక్ స్కూల్” ఎదురుగా ఓ భారీ అక్రమ షెడ్డుకు ఉన్న అనుమతులపై వివరణ కోరుతూ దుండిగల్‌ సర్కిల్ “అసిస్టెంట్ సిటీ ప్లానర్” ఫిబ్రవరి-20న షెడ్డు ప్రారంభ దశలోనే దృష్టికి తీసుకెళ్ళగా..! నోటీసులు ఇచ్చినట్టు స్థానిక చైన్‌మెన్‌‌ వేణుగౌడ్ చెప్పాడు.. హాస్యాస్పద విషయం ఏమిటంటే, నోటీసులు అంటే అక్రమ షెడ్లను, కట్టడాలను ప్రోత్సహించడానికే అన్నట్టు స్పష్టతను ఇస్తున్నారు.. మార్చి-3న సంబంధిత అక్రమ షెడ్డు పూర్తిచేయడం టౌన్‌ప్లానింగ్ అధికారుల అవినీతికి నిదర్శనంగా విమర్శిస్తున్నారు.. ఈ విషయంపై టౌన్‌ప్లానింగ్ అధికారి “ఏసిపి” శ్రీనివాస్ దృష్టికి మార్చి 2న వాట్సప్‌లో ఫొటోలతో దృష్టికి తీసుకెళ్ళినా సమాధానం లేదు.. బౌరంపేట్ సాయిబాబా గుడి సమీపంలో అక్రమ కట్టడాన్ని, ఇప్పటికే రెండు సార్లు కూల్చేశామని,ఒక నోటీసు ఇచ్చామని, గొప్పగా చెప్పుకునే టౌన్‌ప్లానింగ్ అధికారుల కనుసన్నల్లోనే నిర్మాణం పూర్తి దశకు వచ్చింది, టౌన్‌ప్లానింగ్ సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే, చర్యలు తీసుకున్నప్పటికీ..! అక్రమ నిర్మాణ దారుడు “పెంట్ హౌస్” నిర్మాణం చేపట్టాడంటే..! అధికారులకు సెటిల్మెంట్‌ కాకుండా సాధ్యమేనా..? జోనల్ కమిషనర్ దీనికి సమాధానం చెబుతారని ఆశిస్తున్నాం..

మల్లంపేట్‌‌లోనూ నోటీసులిచ్చిన షెడ్లలో..!దర్జాగా “వ్యాపారం”..

టౌన్‌ప్లానింగ్ “అధికారులా- మజాకానా”.. అందులో దుండిగల్‌ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అంటేనే ఒక‌ ప్రత్యేకతగా చెప్పవచ్చు.. కరెప్షన్ అధికారులకి నిలయంగా మారిందని మొన్నటి “ఏసిబి దాడుల”తో తేటతెల్లం అయింది.. ఇంత జరిగినా టౌన్‌ప్లానింగ్ అధికారుల పనితీరులో మార్పు రాకపోవడం బాధాకరం.. అవే అక్రమ షెడ్లు, అవే అక్రమ నిర్మాణాలు, అధికారుల సహకారం అదేవిధంగా ఉందని స్పష్టమవుతుంది.. దుండిగల్‌ సర్కిల్ మల్లంపేట్‌‌లో అక్రమ నిర్మాణాలు దాదాపు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ మొక్కుబడిగా ఓ రెండు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారు.. ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారంలో గతంలో ఓ చైన్‌మెన్‌‌ ఒప్పందంతో సెటిల్మెంట్‌లు జరిగినట్లు తెలుస్తోంది.. అందుకే సింగిల్ నోటీసు వద్దనే చర్యలు స్తంభించాయి.. మల్లంపేట్‌ గ్రీన్‌పార్క్ అసోసియేట్ వెంచర్‌లో ఓ వ్యక్తి ఎలాంటి పర్మిషన్ లేకుండా, వరుసగా దాదాపు ఎనిమిది కమర్షియల్ షట్టర్‌లు నిర్మించాడు.. పెన్ పవర్ వరుస కథనాలకు నోటీసులిచ్చిన అధికారులు “అంతర్గతంగా సెటిల్మెంట్‌లు” చేసుకుని వదిలేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.. ప్రస్తుతం ఆ ఎనిమిది కమర్షియల్ షట్టర్‌లు షాపులతో వ్యాపార సముదాయంగా మార్చారు.. ఈ షట్టర్‌ల వ్యవహారంలో ఓ అధికారి ప్రమేయం ఉన్నట్టు వినికిడి.. ఈ మొత్తం వ్యవహారంలో గతంలో ఓ చైన్‌మెన్‌‌ ఆధ్వర్యంలో జరిగినట్టు సమాచారం..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular