గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 28: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలోని జిపిడబ్ల్యూఏ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పరీక్షలు జరుగుతున్న విధానాన్ని సమీక్షించిన అయన, కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గూడెం కొత్తవీధి సీఐ సుధాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.


