ePaper
Wednesday, March 25, 2026
spot_img
ePaper
Homeతెలంగాణకరీంనగర్పాఠ్యాంశంలో రాజ్యాంగం తప్పనిసరి చేయండి: గట్టు అశోక్- అంజన్న

పాఠ్యాంశంలో రాజ్యాంగం తప్పనిసరి చేయండి: గట్టు అశోక్- అంజన్న

📰 Generate e-Paper Clip

తెలంగాణలో పాఠశాల స్థాయి నుంచే భారత రాజ్యాంగంపై అవగాహన..

తెలంగాణలో 33 జిల్లాల్లో తిరుగుతూ అవగాహన కల్పించిన అంశం..

మేడ్చల్‌లో ముగింపు దశకు చేరిన ఉద్యమం కలెక్టర్‌కు వినతిపత్రం..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వినతి పత్రాలు..

రాజ్యాంగాన్ని విద్యా వ్యవస్థలో భాగం చేయాలన్న డిమాండ్ రోజురోజుకీ బలపడుతోంది.. సామాజిక న్యాయం, హక్కులపై అవగాహన పెంచేందుకు ఇది ఎంతో కీలకమని ఉద్యమకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఇప్పటికే 5వ తరగతిలోనే ఆర్టీఏ యాక్ట్ గురించి కూడా ఉన్నప్పటికీ.. మరింత విస్తృత పరిస్తే, బాగుంటుందనేది న్యాయ నిపుణుల వాదన.. ప్రతి నెల చివరిలో పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా, సామాన్యులకు సైతం చట్టాలపై అవగాహన కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం పలు కాలనీలు, గ్రామాలలో రెవెన్యూ, పోలీసు అధికారులు నిర్వహిస్తున్నది తెలిసిందే.. అయినప్పటికీ 6వ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా, రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేరిస్తే పౌరహక్కులపై ప్రజలకు మరింత అవగాహన కల్పించినట్టు అవుతుందని భావిస్తున్నారు.. ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..

కుత్బుల్లాపూర్, పెన్ పవర్, మార్చి 24:

పాఠ్యాంశాలలో భారత రాజ్యాంగాన్ని చేర్చాలని తెలంగాణలో 33 జిల్లాల్లో తిరుగి, కలెక్టర్‌లకు వినతిపత్రాలు అందజేయాలని జై భీమ్ మహాసేన మనవహక్కుల పరిరక్షణ సంఘం వ్యవస్థాపకులు అంజన్న, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు అశోక్ అన్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ పై గత 25 రోజుల నుండి తెలంగాణ 33 జిల్లాల పర్యటనలో భాగంగా, తిరుగుతూ 30 జిల్లాలు సంపూర్ణంగా ప్రజలను చైతన్య పరుస్తూ ఆయా జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్‌లకు మొమొరాండం సమర్పించినట్టు ఉద్యమ కారుడు గట్టు అశోక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. ఈ వినతి పత్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరేటట్లుగా చేయాలని కలెక్టర్‌లను కోరినట్లు తెలిపారు.. ప్రతి జిల్లా కలెక్టర్ కూడా తమ మనవి ఆలకించి వినతి పత్రాలు తీసుకోవడం జరిగిందని అన్నారు.. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన సదస్సులు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ 31వ జిల్లా అయినా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మంగళవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూల దండలు వేసుకుంటూ, జిల్లా వ్యాప్తంగా ఈ రథయాత్ర కొనసాగిందని అన్నారు.. ఈ కార్యక్రమంలో జై భీమ్ మహాసేన మనవహక్కుల పరిరక్షణ సంఘం వ్యవస్థాపకులు అంజన్న, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు అశోక్, మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏ ఎస్తేరు రాణి గారు సలహాదారులు అలెగ్జాండర్ ప్రభు, బాలస్వామి, బ్రాహ్మ మరియు ఎల్లన్న, అంబేద్కర్ .సంఘం అధ్యక్షులు రాములు . నాగేష్ పాల్గొని మేడ్చల్ జిల్లా రథయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేశారు..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular