
అడ్డతీగల పెన్ పవర్ మార్చ్08: సరిహద్దు ప్రాంతమైన ఏలేరు రిజర్వాయర్ సమిపంలోనే పులి సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గత రాత్రి అడ్డతీగల మండలం డి.కృష్ణవరం వద్ద రైతు మకాంలో ఆవు దూడ కళేబరాన్ని పులి సుమారు 100 మీటర్లు లాగి తీసుకెళ్లి తిన్నట్లు అధికారులు గుర్తించ్చారు. ఆదివారం స్థానిక రైతులతో కలిసి అంబోతు కాలువ వద్ద పులి పాదముద్రలు గుర్తించిన అధికారులు, పాదముద్రల ఆధారంగా గంగవరం మండలం మల్లవరం, ట్యాంక్ బీడు వైపు వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మర్రివిడు, కంబాల పాలెం, డి. కృష్ణవరం గ్రామాలలో
అటవీ శాఖ గస్తీ నిర్వహిస్తూ పులిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ శాఖ అధికారుల అంచనాలను తారుమారు చేస్తూ పెద్దపులి తన మార్గాన్ని వేరే దారి మళ్లించి పరిమితడక మీదుగా వీరభద్రపురం రిజర్వ్ ఫారెస్ట్ వైపు వెళ్ళిపోయింది.

దీంతో అటవీశాఖ అధికారులు ఆయా గ్రామాల పరిధిలో ప్రజలను అప్రమత్తం చేస్తూ పరుగులు పెట్టారు. సి సి ఎఫ్ బి ఎన్ ఎన్ మూర్తి ( అమరావతి), డీఎఫ్ఓ శివ కుమార్ గంగల్ రంపచోడవరం, సబ్ డి ఎఫ్ ఓ సుబ్బారెడ్డి అడ్డతీగల పర్యవేక్షణలో పులిని బంధించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు.



