ePaper
Thursday, March 26, 2026
ads
ePaper
Homeఆంధ్రప్రదేశ్పల్నాడుప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధతలో ప్రభుత్వ తొలి అడుగు : ప్రత్తిపాటి

ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధతలో ప్రభుత్వ తొలి అడుగు : ప్రత్తిపాటి

📰 Generate e-Paper Clip

రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్రం జారీ చేసే గెజిట్ నోటిఫికేషన్ కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం : ప్రత్తిాపాటి

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 :

చిలకలూరిపేట : గత పాలకుల విధ్వంసంతో ప్రాభవాన్ని కోల్పోయిన ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు.. రాష్ట్ర శాశ్వత రాజధానిగా మార్చే క్రతువులో ప్రభుత్వం నేడు తొలి అడుగు వేయడం ప్రజలకు గర్వకారణం. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడం శుభపరిణామం. కూటమి ప్రభుత్వ ప్రజా భీష్టానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయంపై యావత్ తెలుగుజాతి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. అమరావతి చట్టబద్ధతపై కేంద్రప్రభుత్వం కూడా శీఘ్రంగా స్పందించి తన బాధ్యతను సకాలంలో పూర్తిచేయాలని, 5 కోట్ల ప్రజల ఆకాంక్షలను, ఆశలను సాకారం చేయాలని వారి తరుపున విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే రోజు కోసం ఎంతో ఉత్సుకతగా ఎదురు చూస్తున్నాం. అని మాజీమంత్రి ప్రత్తిపాటి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular