ePaper
Tuesday, March 31, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడప్రైవేట్ ట్రావెల్స్‌పై పోలీసుల ప్రత్యేక తనిఖీలు ప్రయాణికుల భద్రతే లక్ష్యం – ఎస్సై మోహన్...

ప్రైవేట్ ట్రావెల్స్‌పై పోలీసుల ప్రత్యేక తనిఖీలు ప్రయాణికుల భద్రతే లక్ష్యం – ఎస్సై మోహన్ కుమార్

📰 Generate e-Paper Clip

కాజులూరు, పెన్ పవర్, మార్చి 31:

కాజులూరు మండలం గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. గొల్లపాలెం ఎస్సై ఎం. మోహన్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఈ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.గొల్లపాలెం–కోటిపల్లి ప్రధాన రహదారి గుండా హైదరాబాద్‌కు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆపి, వాటి రికార్డులను పోలీసులు సవివరంగా పరిశీలించారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తదితర అంశాలను తనిఖీ చేసి నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్సై మోహన్ కుమార్ మాట్లాడుతూ, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా పరిమితికి మించి వేగంగా వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.

గొల్లపాలెం ప్రధాన కూడళ్ల వద్ద వేగం తగ్గించి, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular