ePaper
Wednesday, March 25, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రకాశంబస్సులో దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన ఆర్టీసీ సిబ్బంది.

బస్సులో దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన ఆర్టీసీ సిబ్బంది.

📰 Generate e-Paper Clip

* పోలీసుల ప్రశంసలతో పాటు సన్మానం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది.

* బస్సు డ్రైవర్ కండక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత మహిళ కుటుంబ సభ్యులు.

గుడ్లూరు, పెన్ పవర్, మార్చి 25:

ఆర్టీసీలో మహిళ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారు వస్తువులను ఆ బస్సు కండక్టర్, డ్రైవర్ పోలీసులకు అప్పగించిన ఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ వెంకాయమ్మ తన బంగారు బ్రాస్లెట్‌ను మాచవరం బ్యాంకులో తనకాపెట్టి డబ్బులు తీసుకొనుట కొరకు వెళ్లగా, బ్యాంక్‌లో పని అవ్వడంతోపాటు గుడ్లూరు రావడానికి కందుకూరు డిపోకు చెందిన ఏపీ 27 టీజడ్ 0808 అను బస్సులో ఎక్కి తన గోల్డ్ ను బస్సులో మర్చిపోయిలూరులో దిగింది. దిగిన తర్వాత బస్సులో గోల్డ్ మర్చిపోయాను అన్న విషయం గుర్తుకు రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది ఉషారాణి, లక్ష్మణస్వామి, డ్రైవర్ సురేంద్రలు వెంటనే ఎస్ఐ వెంకట్రావుకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై బస్సు కండక్టర్ ని కాంటాక్ట్ అవ్వగా ఈలోపు బస్సు కండక్టర్ సీటులో ఉన్న బ్రాస్లెట్ చూసి తన వద్ద ఉంచుకొని, వెంటనే ఈ డ్రైవర్ పోలీసులకు తెలియజేశారు. ఈ సమయంలో బస్సు కండక్టర్ నిజాయితీగా గోల్డ్ తీసుకొని గుడ్లూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చి బాధిత మహిళ దేవరకొండ వెంకాయమ్మకు అందించారు. దీనితో తను బస్సులో పోగొట్టుకున్న గోల్డ్ ను అందుకున్న వెంకాయమ్మ, ఆమె కుటుంబ సభ్యులు బస్సు కండక్టర్ చంద్రమోహన్ రావుకు, డ్రైవర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ బస్సులో బస్సు కండక్టర్ చంద్రమోహన్ రావు మరియు డ్రైవర్ నిజాయితీగా తీసుకొని వచ్చినందుకు వారికి స్థానిక ఎస్సై వెంకట్రావు గోల్ సంఘటనతో సత్కరించి, ప్రసంగం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular