ePaper
Thursday, March 19, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్మంచి-చెడులను సమానంగా స్వీకరించాలి.. ఎస్సై సాంబ శివరావు

మంచి-చెడులను సమానంగా స్వీకరించాలి.. ఎస్సై సాంబ శివరావు

📰 Generate e-Paper Clip

పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 19

ఉగాది పండుగ తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన పర్వదినమని ఎస్సై సాంబ శివరావు అన్నారు. పుల్లల చెరువు మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ కళా ప్రాంగణంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది అనేది షడ్రుచుల సమ్మేళనం అని, జీవితం లో ఎదురయ్యే విభిన్న అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మనుషుల జీవితంలో కలిగే సుఖదుఃఖాలను, విజయాపజయాలను సూచిస్తాయని వివరించారు.సంవత్సరమంతా ఎదురయ్యే మంచి-చెడులను సమానంగా స్వీకరించి, సంయమనంతో ముందుకు సాగాలని ఈ పండుగ మనకు బోధిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి నెలకొనాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళా ప్రాంగణ సభ్యులు కే.జే. రఘు, ఉప్పల హనుమంతు, ఆర్మీ బుజ్జి, జీవి గురునాదం, చిల్లంచెర్ల సుబ్బారావు, గాజులపల్లి కిష్టయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular