ePaper
Saturday, March 21, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్మహేష్ పై వేటుకు రంగం సిద్ధం..

మహేష్ పై వేటుకు రంగం సిద్ధం..

📰 Generate e-Paper Clip

విజయవాడ,పెన్ పవర్ మార్చి20

డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న పుట్టా మహేష్ యాదవ్‌పై తెలుగుదేశం పార్టీలో కఠిన చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడని నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తిరుపతి జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో ఆయన స్పందన తీవ్రంగా ఉండటం, మహేష్ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. “పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వారిని మోయాలా?” అన్న ప్రశ్నతో పార్టీ శ్రేణులకు గట్టి సంకేతం ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఇంటికే అన్న పేరుంది. డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న పుట్టా మహేష్ యాదవ్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి చూస్తుంటే, ఆయన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ వచ్చేసింది. “పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వాళ్లను మోయాలా?” అంటూ బాబు వేసిన ప్రశ్న.. మహేష్‌పై వేటుకు రంగం సిద్ధమైందనేదానికి నిదర్శనంతిరుపతి జిల్లా నేతతో జరిగిన భేటీలో చంద్రబాబు ఆవేశం కట్టలు తెంచుకుంది. సాధారణంగా ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు ఆచి తూచి స్పందించే బాబు, ఈసారి మాత్రం ఏకంగా “పార్టీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? డ్రగ్స్ తీసుకోవడం ఏంటి?” అని నిలదీశారు. పుట్టా మహేష్ వ్యవహారం కేవలం ఒక వ్యక్తి పొరపాటు కాదని, అది ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమని అధిష్టానం భావిస్తోంది.పుట్టా సుధాకర్ యాదవ్ వంటి విధేయుడైన నేతకు తనయుడిగా, యనమల రామకృష్ణుడు వంటి దిగ్గజానికి అల్లుడిగా మహేష్‌కు పార్టీలో రెడ్ కార్పెట్ పరిచారు. కానీ, ఆ గౌరవాన్ని కాపాడుకోవడంలో ఆయన విఫలమయ్యారు. కుటుంబ నేపథ్యం చూసి అవకాశం ఇచ్చాం, కానీ దాన్ని దుర్వినియోగం చేశారన్న బాబు మాటలు.. వారసత్వ రాజకీయం ఇకపై షీల్డ్‌లా పనిచేయదని స్పష్టం చేస్తున్నాయి. గతంలో కూడా తప్పు చేసిన వారిని ఉపేక్షించలేదని గుర్తు చేస్తూ, ఇప్పుడు కూడా అదే కఠిన ఫార్ములాను అమలు చేసేందుకు బాబు మొగ్గు చూపుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ కల్చర్‌పై యుద్ధం ప్రకటిస్తున్న తరుణంలో, సొంత పార్టీ నేతే ఆ ఆరోపణల్లో ఉండటం బాబుకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. అందుకే, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ముందే సర్జరీ చేసేయాలని అధిష్టానం భావిస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదా షోకాజ్ నోటీసులతో మొదలుపెట్టి, శాశ్వతంగా పక్కన పెట్టేలా స్కెచ్ సిద్ధమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.పుట్టా మహేష్ పై తీసుకోబోయే చర్య కేవలం ఆయనకు మాత్రమే పరిమితం కాదు. పార్టీ ముసుగులో విచ్చలవిడిగా ప్రవర్తించే మిగిలిన యువ నేతలకు ఇదొక హెచ్చరిక. పార్టీ క్రమశిక్షణ రేఖ దాటితే కుటుంబంతో సంబంధం లేకుండా బహిష్కరణ తప్పదని ఈ ఘటనతో బాబు నిరూపించబోతున్నారని సమాచారం.మొత్తానికి పుట్టా మహేష్ వ్యవహారం టీడీపీలో ఒక పెద్ద కుదుపుకు దారితీసింది. ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చేసిందని, అధికారికంగా వేటు వేయడమే తరువాయి అని తెలుస్తోంది. తండ్రి సుధాకర్ యాదవ్ వారసత్వాన్ని నిలబెట్టాల్సింది పోయి, డ్రగ్స్ వివాదంతో రాజకీయ సమాధిని తవ్వుకున్నారన్న విమర్శలు సొంత నియోజకవర్గంలోనే వినబడుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular