ePaper
Monday, March 23, 2026
spot_img
ePaper
Homeఆర్టికల్స్మిసైల్ సిటీస్ అంటే ఏమిటి?

మిసైల్ సిటీస్ అంటే ఏమిటి?

📰 Generate e-Paper Clip

  • మిసైల్ నగరాలు అంటే ఏమిటి?
  • పర్వతాల కింద గూఢ నిర్మాణం
  • యుద్ధ సమయాల్లో కీలక భూమిక
  • ఎవరి ఆధీనంలో ఈ కేంద్రాలు?
  • ఎక్కడ ఉన్నాయి ఈ రహస్య కేంద్రాలు?
  • రహస్యంగా ఉంచిన వివరాలు
  • భారీ అండర్‌గ్రౌండ్ నిర్మాణం
  • మిసైల్ రవాణా వ్యవస్థ
  • స్వయం సమృద్ధి గల సైనిక కేంద్రాలు
  • మిసైళ్ల శక్తి & పరిధి

ఇరాన్‌ మిసైల్ నగరాలు కేవలం రహస్య సైనిక స్థావరాలు మాత్రమే కాదు… అవి దేశ రక్షణ వ్యూహంలో కీలక భాగం. శత్రువుల దాడులను తట్టుకుని, అవసరమైనప్పుడు ప్రతిదాడి చేయగల శక్తిని ఇవి ఇరాన్‌కు అందిస్తున్నాయి.

న్యూస్ డెస్క్ పెన్ పవర్ మార్చి 22:

ఇరాన్‌ నిర్మించిన “మిసైల్ నగరాలు” అనేవి భూగర్భంలో నిర్మించిన రహస్య సైనిక కేంద్రాలు. వీటిలో బాలిస్టిక్ మిసైళ్లను నిల్వ చేయడం, సిద్ధం చేయడం, ప్రయోగించడం జరుగుతుంది. ఈ కేంద్రాలు పర్వతాల లోపల, ఎడారుల క్రింద నిర్మించబడ్డాయి. శత్రువుల వైమానిక దాడుల నుంచి రక్షణ పొందడమే ప్రధాన లక్ష్యం.ఎయిర్‌బేస్‌లు, ఇతర సైనిక కేంద్రాలు ధ్వంసమైనా… మిసైల్ ప్రయోగ సామర్థ్యం కొనసాగేందుకు ఈ నగరాలు ఉపయోగపడతాయి.

ఈ మిసైల్ నగరాల నిర్వహణ ప్రధానంగా ఇరాన్‌ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC), ముఖ్యంగా వారి ఏరోస్పేస్ విభాగం చేతుల్లో ఉంటుంది.కెర్మాన్‌షా, సెమ్నాన్ ప్రావిన్స్‌లు, పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతాలు వంటి ప్రాంతాల్లో ఇవి ఉన్నట్లు అంచనా. ఈ కేంద్రాల సంఖ్య, ఖచ్చితమైన స్థానం పూర్తిగా గోప్యంగా ఉంచబడింది. అయితే దేశవ్యాప్తంగా డజన్ల కొద్దీ ఉండొచ్చని భావిస్తున్నారు. తురంగాలు, నిల్వ గదులు, ప్రయోగ కేంద్రాలతో కూడిన విస్తృతమైన సముదాయం. కొన్ని టన్నెల్లు 500 మీటర్ల లోతు వరకు ఉంటాయి. టన్నెల్లలో ప్రత్యేక వాహనాల ద్వారా మిసైళ్లను ప్రయోగ కేంద్రాలకు తరలిస్తారు.

 

పర్వతాల మధ్య లేదా ఎడారిలో ఉన్న లాంచ్ పాయింట్ల నుంచి ప్రయోగిస్తారు. ఈ నగరాల్లో కమాండ్ సెంటర్లు, ఇంధన నిల్వలు, విద్యుత్ వ్యవస్థలు, సైనికుల నివాసాలు కూడా ఉంటాయి. కొన్నిచోట్ల రైల్వే లాంటి అంతర్గత రవాణా వ్యవస్థలు కూడా ఉన్నట్లు సమాచారం.ఇమాద్‌, సెజ్జిల్‌, ఖదర్‌, ఖైబర్‌ షెకాన్ వంటి మిడిల్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు ఇక్కడ నిల్వ ఉంటాయి. వీటి పరిధి 1400 నుంచి 2500 కిలోమీటర్లు… కొన్నివరకు 4000 కిలోమీటర్లకు పైగా దాడి చేయగలవు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular