
నిరుపయోగంగా ఉన్న ఆర్&బీ స్థలం ప్రార్థనలకు కేటాయించాలని ప్రత్తిపాటిని కోరిన పసుమర్రు టీడీపీ నాయకులు, గ్రామ ముస్లింలు
తూబాడు – నాదెండ్ల మధ్యలో నిర్మించాల్సిన కిలోమీటర్ ఆర్ & బీ రోడ్డు అంచనాలు రూపొందించండి.
8 వ వార్డులో అవసరమైన చోట కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయండి
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాజీమంత్రి ప్రత్తిపాటి
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 20:
చిలకలూరిపేట: ప్రార్థనా అవసరాల నిమిత్తం గ్రామ ముస్లింలు కోరిన విధంగా ఆర్&బీ స్థలం కేటాయించేలా సంబంధిత అధికారులతో మాట్లాడతానని మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు.
శుక్రవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ నాయకులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (ప్రజా దర్బార్) నిర్వహించారు. ఈ సందర్భంగా పసుమర్రు కౌన్సిలర్ జాలాది సుబ్బారావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు దశరథ రామయ్య నేతృత్వంలో గ్రామానికి చెందిన ముస్లింలు ప్రత్తిపాటిని కలిసి సమస్యపై వినతి పత్రం అందించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న ఆర్&బీ స్థలాన్ని తమ ప్రార్థనా అవసరాలకు కేటాయించేలా చూడాలని వారు ప్రత్తిపాటిని కోరగా, ఆయన వెంటనే స్పందించారు. ఆర్&బీ ఉన్నతాధికారులతో మాట్లాడి స్థలం కేటాయించేలా చూస్తానని గ్రామస్తులకు చెప్పారు.
కిలోమీటర్ రోడ్డు సరిగా లేక ప్రమాదాలు : తూబాడు గ్రామస్తులు
సాతులూరు – దింతెనపాడు ఆర్&బీ రోడ్డులో తూబాడు – నాదెండ్ల గ్రామాల మధ్యలోని కిలోమీటర్ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తిచేయాల్సి ఉందని, మధ్యలో రోడ్డు బాగా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తూబాడు గ్రామస్తులు ప్రత్తిపాటికి తెలియచేశారు. గ్రామస్తుల వినతిపై స్పందించిన ఎమ్మెల్యే సదరు కొద్దిపాటి రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంచనాలు వెంటనే రూపొందించి, ఉన్నతాధికారులకు పంపాలని స్థానిక ఆర్ & బీ ఈఈని ఆదేశించారు. అంచనాలు పంపాక తనకు చెబితే అధికారులతో మాట్లాడి పాలనా అనుమతులు వచ్చేలా చూస్తానన్నారు.
తమ వార్డులో విద్యుత్ స్తంభాలు సరిగా లేవని, వర్షాకాలం వస్తే ఉన్న స్తంభాల్లో కొన్ని నేలకొరిగే అవకాశముందని 8వ వార్డు ప్రజలు ప్రత్తిపాటికి తెలియచేశారు. వెంటనే నూతన విద్యుత్ స్తంభాలు వేయాలని ప్రత్తిపాటి ఆర్&బీ అధికారుల్ని ఆదేశించారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ , మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, టీడీపీ నాయకులు షేక్ మస్తాన్వలి, కొత్త కోటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ వివరాలు
పేరు: SRIKANTH NARASIMHALAహోదా: STAFF REPORTER
ప్రాంతం: CHILAKALURI PETA, PALNADU DIST



