ePaper
Saturday, March 21, 2026
spot_img
ePaper
Homeతెలంగాణరాష్ట్ర వార్షిక బడ్జెట్లోబహ్మణులకు ప్రభుత్వం తీరని అన్యాయం

రాష్ట్ర వార్షిక బడ్జెట్లోబహ్మణులకు ప్రభుత్వం తీరని అన్యాయం

The government is doing immense injustice to Brahmins in the state's annual budget.

📰 Generate e-Paper Clip

 1. బడ్జెట్‌పై బ్రాహ్మణ సంఘాల అసంతృప్తి

 2. ₹5,000 కోట్ల ప్రత్యేక నిధి డిమాండ్

 3. బకాయిల వెంటనే చెల్లింపు

 4. బ్రాహ్మణ కార్పొరేషన్‌పై విమర్శలు

 5. అధికారుల పనితీరుపై అసంతృప్తి

6. కొత్త ప్రభుత్వంపై ఆరోపణలు

7. మంత్రి పనితీరుపై ప్రశ్నలు

 8. 20 లక్షల కుటుంబాల సమస్యలు

 9. కార్పొరేషన్ పేరు మార్పుపై వ్యాఖ్య

 10. ప్రభుత్వానికి హెచ్చరిక

 

రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో సామాజిక వర్గాల అసంతృప్తి బయటపడుతోంది. గ్లోబల్ బ్రాహ్మణ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసిన ఈ డిమాండ్లు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో అనేది రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది. సామాజిక సమతుల్యత, సంక్షేమం మధ్య సమన్వయం సాధించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది.

హైదరాబాద్ | పెన్ పవర్  | మార్చి 21:

 బ్రహ్మణ పరిషత్ కు తక్షణమే ఐదువేల కోట్ల బడ్జెట్ ను కేటాయించాలి గోబల్ బ్రహ్మణ్సు వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ హైదరాబాద్ పెన్ పవర్ మార్చి 21: రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్లోబహ్మణులకు ప్రభుత్వంతీరని అన్యాయం చేసిందని గోబల్ బ్రహ్మణ్సు వెల్ఫేర్ అసోసియేషన్ గిరిప్రసాద్ శర్మ, రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం ఆరోపించారు. శనివారం హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రహ్మణ పరిషత్ కు తక్షణమే ఐదువేల కోట్ల బడ్జెట్ ను కేటాయించాలని, గతంలో ఉన్న బకాయిలను వెంటనే లబ్దిదారుల ఖాతాలోకి జమా చేయాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బ్రహ్మణ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసినప్పటికీ ఒక ఐఏఎస్ ను నియమించలేదని వెంటనే ఐఏఎస్ అధికారిణి నియమించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అధికారిగా కొనసాగిన శైలజ రామయ్య తమ కార్పొరేషన్ సంబందించిన ఒక ప్రకటనను ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఏర్పాటు చేసిన ఏ ఒక్క పథకంకు సైతం నిధులు ఇవ్వలేదని వారు మండిపడ్డారు బ్రహ్మణ సామాజిక వర్గంకు చెందిన మంత్రి ఉన్నప్పటికీ ఆయన పూజలు, పునస్కారాలు, సన్మాలు చేసుకోవడానికే పనికి వస్తున్నారనే తప్ప బ్రహ్మణులకు చేసింది ఏమిలేదని ఆరోపించారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల బ్రహ్మణ కుటుంబాలు ఉన్నాయని పూజలు, పంచాగలతోనే కాలం వెల్లదీస్తు, ఇతర వర్గాలతో పోటీ పడాలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేసి బ్రహ్మణులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు బ్రహ్మణ కార్పొరేషన్ పేరు ప్రభుత్వానికి నచ్చకపోతే సోనియాగాంధీ బ్రహ్మణ కార్పొరేషన్ పెట్టుకున్న తమకు అభ్యంతరం లేదన్నారు. తమకు ప్రభుత్వంపై తమకు ఏలాంటి ద్వేషం లేదని తమను కాగితాలకే పరిమితంచేయకుండా చూడాలన్నారు. లేని యెడల బ్రహ్మణుల శాపాలకు గురికాకతప్పదని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో అసోసియేష్ ప్రతినిధులు పురుషోత్తంరావు, కోటేశ్వరరావు,మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular