ePaper
Monday, March 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రైతుల ఆర్థిక బలోపేతానికి.. పశుపోషణే కీలక ఆదాయ వనరు : ప్రత్తిపాటి

రైతుల ఆర్థిక బలోపేతానికి.. పశుపోషణే కీలక ఆదాయ వనరు : ప్రత్తిపాటి

📰 Generate e-Paper Clip

  • గేదెలు అనారోగ్యానికి గురైతే పాల దిగుబడి తగ్గుతుంది
  • పశుపోషణకు ప్రభుత్వం అందించే రాయితీలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలి
  • మానుకొండవారిపాలెంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి.
  • ప్రభుత్వం అందించే ఉచిత పశువైద్యసేవలు, పశుపోషణ రాయితీలు, ప్రోత్సాహకాల్ని రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 30 : 

చిలకలూరిపేట: మానుకొండవారిపాలెంలో పశుసంవర్థక మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రత్తిపాటి ప్రారంభించి, రైతుల్ని, గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు.

పశువులకు గాలికుంటు, గొంతువాపు వ్యాధి టీకాలు, గొర్రెలకు నాచు, నీలినాలుక వ్యాధి టీకాలను పశుసంవర్ధక శాఖ యంత్రాంగం ఉచితంగా వేస్తోందన్నారు. నట్టల నివారణ మందులతో పాటు, పశువులను పరీక్షించి అవసరమైన అన్నిరకాల మందుల్ని ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు. గేదెలు, ఆవులు అనారోగ్యానికి గురైతే పాల దిగుబడి తగ్గుతుందన్నారు.

గత ప్రభుత్వం ఇష్టానుసారం, స్వార్థ ప్రయోజనాలకోసం మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మరలా పంచాయతీలుగా పరిగణించబోతున్నామని ప్రత్తిపాటి చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కల్లి వీర రెడ్డి, పశు వైద్యులు డాక్టర్ రాధాకృష్ణ, నాగేశ్వరరావు , దీప్తి, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular