ePaper
Tuesday, March 31, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజువర్ర తోకవలస గ్రామంలో దాహం కేకలు

వర్ర తోకవలస గ్రామంలో దాహం కేకలు

📰 Generate e-Paper Clip

  • వేసవి ప్రారంభంలోనే వర్ర తోకవలసలో తీవ్ర తాగునీటి ఎద్దడి
  • కలుషిత నీరు తాగి అనారోగ్య బారిన పడుతున్న గిరిజన కుటుంబాలు
  • జల్ జీవన్ మిషన్ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో మళ్లీ పాత కష్టాలు
  • గుక్కెడు నీటి కోసం పొలాలు, ఊటగడ్డల వెంట పరుగులు తీస్తున్న గ్రామస్తులు
  • బిల్లులు పెండింగ్ అంటూ నిలిచిపోయిన పనులు.. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
  • త్వరితగతిన పనులు పూర్తి చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి

అరకలోయ, పెన్ పవర్, మార్చి 31:

వేసవి ప్రారంభం లోనే తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చి ప్రజలు కన్నీటి కష్టాలు కనిపిస్తున్నాయి.అధికారులు నిర్లక్ష్యం కారణంగా గిరిజన గ్రామాల్లో మంచినీటి సమస్య తో గిరిజనులు విలవిలలాడుతున్నారు.మండలంలోని మారుమూల ప్రాంతమైన శిరగం పంచాయతీలో  వర్ర తోకవలస గ్రామం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.ప్రతి గ్రామానికి మంచినీటి భద్రత , ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్న ఏళ్ల తరబడి తమ గ్రామంలో మంచి నీటి సమస్య వేధిస్తోందని అంటున్నారు.గిరిజన ప్రాంతంలో త్రాగునీరు కల్పన కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం చెబుతున్న అవి ప్రకటనలు వరకే పరిమితం అవుతున్నాయని ఆరోపణలు గుప్పిస్తున్నారు.త్రాగు నీరు లేక దాహం కేకలతో నిత్యం అల్లాడుతున్నమని గ్రామస్తులు వాపోతున్నారు.గుక్కెడు నీరు కోసం పొలాలు, ఊట గడ్డల వెంట ఉరుకులు పరుగులు పెడుతున్నారు.కలుషిత నీటి ను సేవించి  అనారోగ్య బారిన పడుతున్నామని తమ గోడును వినిపిస్తున్నారు.గతంలో జల్ జీవన్ మిషన్ పథకం మంజూరైంది.ప్రతి ఇంటికి కొళాయి కోసం బోర్ బావి తవ్యి, పనులను మొదలు పెట్టడంతో మంచి నీటి కష్టాలు తీరయని గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.అయితే ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు గుత్తేదారుడు పనుల్ని అర్ధాంతరంగా మధ్యలోనే ఆపివేయడం తో మళ్లీ ఆ గ్రామంలో మంచి నీటి కష్టాలు మొదలయ్యాయి.త్రాగునీరు కోసం ఏర్పాటు చేసిన బోర్ బావి, పైపులకు మట్టి కప్పకుండా, పైన ఉంచాడంతో అలంకార ప్రాయంగా దర్శనం ఇస్తున్నాయి.జల్ జీవన్ మిషన్ పథకం పనులు ఇంకా కొలిక్కి రాకపోవడంతో  త్రాగునీరు కష్టాలు తప్పడం లేదు.దీంతో గ్రామస్తులకు మంచినీటి సౌకర్యం అందని ద్రాక్షగా మారింది.పాలకులు, అధికారులకు ఎన్నిసార్లు తమ గోడు ను విన్నా వించిన పట్టించుకుని నాధుడే కరువయ్యారని ఆరోపిస్తున్నారు.తమ గ్రామంలో ఉన్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తోచడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు.ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యమ్నయ చర్యలు చేపట్టకపోవడం పై గ్రామస్తులు పెదవి విరుస్తున్నారు.వేసవికాలం ప్రారంభంలోనే మంచినీటి ఎద్దడి ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింతగా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు.ఉన్నతాధికారుల పర్యావేక్షణ లేకపోవడం సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవటంతో మంచి నీటి సమస్యలు ఉత్పనమవుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.ప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి వర్ర తోకవలస గ్రామంలో జల్ జీవన్ మిషన్ పనుల్ని త్వరితగతిన పూర్తి చేసి తాగునీరు అందించేల చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆర్ డబ్ల్యూఎస్ అధికారి కు వివరణ కోరగా,జల్ జీవన్ మిషన్ కు సంబంధించి బిల్లు లు పెండింగ్ ఉండటంతో పనులు జరగడం లేదని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular