ePaper
Saturday, March 28, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజువీరవరం గ్రామంలో రూ.2.10 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన

వీరవరం గ్రామంలో రూ.2.10 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

వీరవరం గ్రామంలో రూ.2.10 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 27:మండలంలో జీకే వీధి పంచాయతీ పరిధిలోని వీరవరం గ్రామంలో సుమారు రూ.2 కోట్ల 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జీకే వీధి సర్పంచ్ కోర్ర సుభద్ర, ఎంపీపీ బోయిన కుమారి, ఎంపీటీసీలు రీమల రాజేశ్వరి, పసుపులేటి నాగమణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కొండలరావు, బీజేపీ మండల అధ్యక్షుడు కాకూరి శేఖర్,అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గొర్లె వీర వెంకట్,వైసీపీ మండల ఉపాధ్యక్షుడు వంతల అరుణ్ కుమార్,బీజేపీ నాయకులు రీమల పాల్,రాం కిరణ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు బోయిన వెంకట్,కృప పాల్గొన్నారు.గ్రామాభివృద్ధి కోసం చేపడుతున్న ఈ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular